Bengaluru Women: అనుమతి లేకుండానే ఇన్‌స్టాలో మహిళల వీడియోలు.. బెంగుళూరులో 26 ఏళ్ల వ్యక్తి అరెస్టు
Bengaluru Women: మహిళల ఫోటోలు, వీడియోలను ఇన్‌స్టాలో అప్లోడ్ చేస్తున్న బెంగుళూరు వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. తమ అనుమతి లేకుండా ఆ వీడియోలను తీసినట్లు ఓ మహిళ ఆరోపణలు చేసింది.
బెంగుళూరు: మహిళల అనుమతి లేకుండా వాళ్లకు చెందిన ఫోటోలు, వీడియోలను ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్టు చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేశారు. 26 ఏళ్ల ఆ నిందితుడిని గుర్దీప్ సింగ్‌గా గుర్తించారు. బెంగుళూరులోని కేఆర్ పురం ఏరియాలో అతను ఉంటున్నాడు. హోటల్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడతను. నిరుద్యోగిగా ఉన్నాడు. బెంగుళూరు వివిధ ప్రదేశాల్లో సంచరిస్తున్న మహిళల ఫోటోలు, వీడియోలను తీసి గుర్దీప్ తన ఇన్‌స్టా అకౌంట్లో పోస్టు చేస్తున్నాడు. అయితే ఇటీవల ఓ మహిళకు చెందిన వీడియో వైరల్ అయ్యింది. ఆమె ఫిర్యాదు చేయడంతో అతన్ని పట్టుకున్నారు. నిందితుడికి ఓ సోదరుడు ఉన్నాడు.
సెంట్రల్ బెంగుళూరులోని పాపులర్ కమర్షియల్ ప్రాంతమైన చర్చిగేట్ వద్ద ఎక్కువగా నిందితుడు వీడియోలు, ఫోటోలు తీశాడు. పబ్లిక్ స్థలాల్లో నడుచుకుంటు వెళ్తున్న వారిని, కెమెరాలను గుర్తించలేనివారిని వీడియోలు తీశాడు. వీధులను తీస్తున్నట్లుగా ఉన్నా.. అతను సీక్రెట్‌గా మహిళల్ని వీడియో తీసినట్లు తెలుస్తోంది. ఓ మహిళ ఇన్‌స్టా కాంటెంట్ పట్ల అప్రమత్తం కావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. చర్చిగేటు వద్ద తిరుగుతున్న వ్యక్తి తమ అనుమతి లేకుండానే ఫోటోలు, వీడియోలు తీస్తున్నాడని ఆమె తన పోస్టులో ఆరోపించింది. తాను ఉన్న వీడియోకు ఆన్లైన్లో తీవ్ర అభ్యంతరకరమైన మెసేజ్‌లు వచ్చినట్లు చెప్పిందామె.
కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. ఇన్‌స్టా అకౌంట్‌ను డిలీట్ చేసే పనిలో పడ్డారు. దీని కోసం మెటా సంస్థతో చర్చిస్తున్నారు. ఇటీవల బెంగుళూరు మెట్రోలో ప్రయాణిస్తున్న మహిళలకు చెందిన వీడియోలను పోస్టు చేసిన కేసు నమోదు అయ్యింది. ఆ కేసులో హసన్ జిల్లాకు చెందిన 27 ఏళ్ల వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ప్రైవేటు కంపెనీలో అకౌంట్స్ శాఖలో పనిచేస్తున్న అతను.. మహిళల వీడియోలు తీసినట్లు అంగీకరించాడు. అతని ఇన్‌స్టా అకౌంట్లో 5వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆ అకౌంట్‌ను డిలీట్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దీక్షా దివస్‌ను విజయవంతం చేయండి : మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
Karthika Deepam | యువతి ప్రాణాలు తీసిన కార్తీక దీపం
Health tips | మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే ఒకసారి కిడ్నీ పరీక్షలు చేయించుకోండి..!
TTD | పోగొట్టుకున్న బంగారాన్ని కొద్ది గంటల్లోనే భక్తుడికి అప్పగించిన టీటీడీ
సైదమ్మ కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆర్థిక సాయం
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

