తీవ్ర విషాదం.. ఆక్సిజన్ ట్యాంకర్ లీకైన ఘటనలో 22 మంది మృతి

నాసిక్ : కరోనా వేళ పెను విషాదం చోటుచేసుకున్నది. ఆక్సిజన్ ట్యాంకర్ లీకైన ఘటనలో 22 మంది రోగులు మృతిచెందారు. నాసిక్‌లోని డాక్టర్ జకీర్ హుస్సేన్ హాస్పిటల్ వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకున్నది. ఆక్సిజన్ ట్యాంకర్ నుంచి సిలిండర్లలో ఆక్సిజన్ నింపుతున్న సమయంలో ప్రమాదం జరిగింది. ఘటనా స్థలం వద్ద ఉన్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. లీకవుతున్న ఆక్సిజన్‌ను అదుపు చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు విజృంభిస్తున్న విషయం తెలిసిందే. దీంతో క్రిటికల్ పేషెంట్లకు ఆక్సిజన్ అవసరం వస్తున్నది.
లీకేజీ ఘటనతో సుమారు 30 నిమిషాల పాటు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయింది. బాధితులంతా వెంటిలేటర్లపై ఆధారపడి ఉన్నారు. వాళ్లకు నిరంతరం ఆక్సిజన్ సరఫరా చేయాల్సి ఉంటుంది. సుమారు 150 మంది రోగులు ఆక్సిజన్‌పై ఆధారపడి ఉన్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ ఘటనపై శీఘ్ర స్థాయిలో విచారణ చేపట్టనున్నట్లు మంత్రి రాజేశ్ తోప్ తెలిపారు.
#WATCH | An Oxygen tanker leaked while tankers were being filled at Dr Zakir Hussain Hospital in Nashik, Maharashtra. Officials are present at the spot, operation to contain the leak is underway. Details awaited. pic.twitter.com/zsxnJscmBp
— ANI (@ANI) April 21, 2021
నాసిక్‌లో జరిగిన ఘటన దురదృష్టకరమని, ప్రాథమిక సమాచారం మేరకు 22 మంది మరణించినట్లు తెలుస్తోందని, ఈ ఘటన గురించి పూర్తి స్థాయి సమాచారాన్ని సేకరిస్తున్నామని, దీని పట్ల దర్యాప్తునకు ఆదేశించామని, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి డాక్టర్ రాజేంద్ర షింగానే తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

