Hottest Year | నవంబర్‌లో రికార్డు ఉష్ణోగ్రతలు.. అత్యంత వేడి సంవత్సరంగా 2024
సగటున 1.5 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలతో 2024 అత్యంత వేడి సంవత్సరంగా రికార్డుల్లో నిలిచిందని యూరోపియన్ వాతావరణ సంస్థ కోపర్నికస్ సోమవారం తెలిపింది.
Hottest Year | న్యూఢిల్లీ: సగటున 1.5 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలతో 2024 అత్యంత వేడి సంవత్సరంగా రికార్డుల్లో నిలిచిందని యూరోపియన్ వాతావరణ సంస్థ కోపర్నికస్ సోమవారం తెలిపింది. ఈ ఏడాది నవంబర్ సగటున 14.10 డిగ్రీల సెల్సియస్‌తో గతేడాది నవంబర్ తర్వాత రెండో అత్యంత వేడి నెలగా నిలిచిందని వెల్లడించింది. పారిశ్రామిక విప్లవం కాలం నాటి ముందు స్థాయిల కంటే ఈ ఏడాది నవంబర్‌లో 1.62 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అధికంగా నమోదైందని చెప్పింది.
భారత వాతావరణ విభాగం ప్రకారం నవంబర్ నెల ఉష్ణోగ్రత రికార్డులు పరిశీలిస్తే 1901 తర్వాత ఈ ఏడాది నవంబర్‌లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 0.62 డిగ్రీలు అధికంగా సగటున గరిష్ఠ ఉష్ణోగ్రతలు 29.37 డిగ్రీల సెల్సియస్‌గా రికార్డయ్యాయి. ఈ ఏడాదిలో ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు దాదాపుగా 0.72 డిగ్రీల సెల్సియస్ వద్ద నిలిచాయని, 1991-2020 సగటుతో పోలిస్తే ఇది అధికమని కోపర్నికస్ తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ATA bathukamma celebrations | ఆస్ట్రేలియా గడ్డపై అంగరంగ వైభవంగా.. 6 వేల మందితో మెల్బోర్న్ లో బతుకమ్మ వేడుకలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Suicide | పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
NHM Employees | ఉరి తాళ్లతో ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
Ambarkishore jha | బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల లక్ష్యం: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
ట్రెండింగ్ వార్తలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!

