చార్ధామ్ యాత్ర.. 20 మంది మృతి
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో చార్‌థామ్ యాత్ర ప్రారంభమై కేవలం ఆరు రోజులే అవుతోంది. అయితే ఈ ఆరు రోజుల్లోనే ఇప్పటికే 20 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. చాలా వరకు బాధితుల్లో ఎక్కువ శాతం గుండె సంబంధిత సమస్యలు లేదా హై ఆల్టిట్యూడ్ సిక్నెనస్‌తో ప్రాణాలు కోల్పోయినట్లు ఆరోగ్యశాఖ చెప్పింది. ఈ నెల 3వ తేదీన గంగోత్రి, యమునోత్రి ఆలయాలను తెరిచారు. ఇక కేదార్‌నాథ్‌ను మే 6వ తేదీన, బద్రీనాథ్‌ను మే 8వ తేదీన తెరిచిన విషయం తెలిసిందే.
యమునోత్రి, గంగోత్రి థామ్‌ల వద్ద సోమవారం నాటికి 14 మంది ప్రయాణికులతో పాటు ఓ నేపాలీ కార్మికుడు తుదిశ్వాస విడిచినట్లు చార్‌థామ్ యాత్ర అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది. ఇక కేదార్‌నాథ్‌లో అయిదుగురు, బద్రీనాథ్‌లో ఒకరు ప్రాణాలు కోల్పోయినట్లు చార్‌థామ్ బోర్డు తెలిపింది. యాత్ర ప్రారంభమైన ఆరు రోజుల్లో ఎక్కువ సంఖ్యలో భక్తులు ప్రాణాలు కోల్పోవడ పట్ల యాత్ర నిర్వాహకులు, అడ్మినిస్ట్రేషన్ ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. చార్‌థామ్ యాత్రలో ఎక్కువగా నడక ఉండడం వల్ల.. అందులో ఎక్కువ శాతం భక్తులు వృద్ధులు కావడంతో మరణాల సంఖ్య అధికంగా ఉన్నట్లు భావిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: ఆరేసిన మ్యాట్ హెన్రీ .. ఇండియా 89 ఆలౌట్.. 244 రన్స్‌తో కివీస్ గెలుపు
Mysaa | టాలీవుడ్లో మరో వాయిదా.. రష్మిక ‘మైసా’ రిలీజ్ డేట్ మారనుందా?
Pat Cummins: ఖావాజా 100 శాతం తప్పు.. అవన్నీ పిచ్చి కూతలు: ప్యాట్ కమ్మిన్స్
HIV | హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు కొత్త ఔషధం.. ఏడాదికి రెండుసార్లు ఇంజెక్షన్ చాలు..
Zakir Naik: జకీర్ నాయక్‌పై నిషేధం మరో అయిదేళ్లు పొడిగింపు
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

