న్యూఢిల్లీ: ఒకే నంబర్ ప్లేట్ కలిగిన రెండు ఎస్‌యూవీలు హై సెక్యూరిటీ జోన్లో కనిపించాయి. (SUVs With Same Number) ఒక వీఐపీ భద్రతా సిబ్బంది వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్‌ను అవి కలిగి ఉన్నాయి. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. మార్చి 18న సాయంత్రం వేళ తుగ్లక్ రోడ్ ప్రాంతంలోని హై సెక్యూరిటీ జోన్లో ఒకే నంబర్‌తో రెండు ఎస్‌యూవీలు పార్క్ చేసి ఉన్నాయి.
కాగా, రెండు కార్లకు ఒకే రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ ఉండటం చూసి పోలీసులు షాక్ అయ్యారు. ఈ వాహనాలు ఫరీదాబాద్‌కు చెందిన వ్యక్తి పేరుతో రిజిస్టర్ అయ్యాయని గుర్తించారు. ఒక వాహనం లైసెన్స్ నంబర్ ప్లేట్ సరైనదేనని పోలీసులు తెలిపారు. మరో వాహనం నంబర్ ప్లేట్‌ను కాపీ చేసినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.