కుప్పకూలిన పురాతన భవనం.. ఇద్దరు వలస కార్మికులు మృతి
పురాతన భవనం| కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన వలస కార్మికులు.. వివిధ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. వలస కార్మికులు ఆశ్రయముంటున్న ఓ పురాత భవనం కూలిపోవడంతో ఇద్దరు మృతిచెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.

వారణాసి: కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన వలస కార్మికులు.. వివిధ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. వలస కార్మికులు ఆశ్రయముంటున్న ఓ పురాత భవనం కూలిపోవడంతో ఇద్దరు మృతిచెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో చోటుచేసుకుంది. వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ధామ్ పక్కనే ఓ పురాతన భవనం ఉన్నది. అందులో పశ్చిమబెంగాల్లోని మాల్డా నుంచి వచ్చిన వలస కార్మికులు ఆశ్రయం పొందుతున్నారు. అయితే అది మంగళవారం తెల్లవారుజామున కుప్పకూలింది. దీంతో ఇద్దరు మరణించగా, మరో ఆరుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు ప్రారంభించారు. అయితే శిథిలాల కింద ఇంకా ఎంత మంది ఉన్నారనే విషయం తెలియరాలేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

