Bijapur | బీజాపూర్‌లో మందుపాతర పేల్చిన మావోయిస్టులు..
ఛత్తీస్‌గఢ్‌లోని (Chhattisgarh) బీజాపూర్‌లో మావోయిస్టులు (Maoists) దారుణానికి పాల్పడ్డారు. బీజాపూర్ (Bijapur) జిల్లాలోని పుస్నార్, గంగలూరు మధ్య మావోయిస్టులు మందుపాతర (IED) పేల్చారు. ఈ ఘటనలో 85వ బెటాలియన్‌కు చెందిన ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు (CRPF jawans) తీవ్రంగా గాయపడ్డారు.
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని (Chhattisgarh) బీజాపూర్‌లో మావోయిస్టులు (Maoists) దారుణానికి పాల్పడ్డారు. బీజాపూర్ (Bijapur) జిల్లాలోని పుస్నార్, గంగలూరు మధ్య మావోయిస్టులు మందుపాతర (IED) పేల్చారు. ఈ ఘటనలో 85వ బెటాలియన్‌కు చెందిన ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు (CRPF jawans) తీవ్రంగా గాయపడ్డారు. అప్రమత్తమైన భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టాయి. గాయపడిన ఇద్దరు జవాన్లను ప్రాథమిక చికిత్స అనంతరం హెలికాప్టర్లో రాయ్‌పూర్ జిల్లా దవాఖానకు తరలించారు. ఈ ఘటనను జిల్లా ఎస్పీ ఆంజనేయ వర్షిణి ధృవీకరించారు.
గత ఏప్రిల్ నెలలో దంతేవాడ (Dantewada) జిల్లాలో మావోయిస్టులు ఐఈడీ పేల్చారు. దీంతో పది మంది జవాన్లు, వ్యాన్ డ్రైవర్ మృతిచెందారు. అర్ణాపూర్ స్టేషన్ పరిధిలో రాష్ట్ర పోలీసు విభాగానికి చెందిన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డులు (DRG) మావోయిస్టుల కోసం గాలింపు నిర్వహించి తిరిగి క్యాంపునకు వస్తుండగా మందుపారత పేల్చినట్లు అధికారులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

