చెడు వ్యసనాలు.. స్నేహితున్ని హత్యచేసిన టీనేజర్లు
స్నేహితులు| ఆ ముగ్గురూ టీనేజీ కుర్రాళ్లే. ఎక్కడికైనా ముగ్గురు కలిసే వెళ్లేవారు. ఏది చేసిన కలిసే చేసేవాళ్లు. అయితే వారిలో ఒక పిల్లవానికి.. తన ఇద్దరు స్నేహితులు చెడు అలవాట్ల వైపు వెళ్లడం నచ్చలేదు. దీంతో వారి కుటుంబ సభ్యులకు చెప్పాడు.

ఇండోర్: ఆ ముగ్గురూ టీనేజీ కుర్రాళ్లే. ఎక్కడికైనా ముగ్గురు కలిసే వెళ్లేవారు. ఏది చేసిన కలిసే చేసేవాళ్లు. అయితే వారిలో ఒక పిల్లవానికి.. తన ఇద్దరు స్నేహితులు చెడు అలవాట్ల వైపు వెళ్లడం నచ్చలేదు. దీంతో వారి కుటుంబ సభ్యులకు చెప్పాడు. దీంతో అతనిపై కక్ష పెంచుకున్న ఆ ఇద్దరు యువకులు అతన్ని చంపేశారు. అంతేకాదు అతన్ని ఓ క్వారీలో పూడ్చిపెట్టి తమకు ఏమీ తెలియనట్లు మిన్నకుండిపోయారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని రత్లామ్‌లో జరిగింది.
రత్లామ్ జిల్లాలోని దయాల్‌పురా అనే ఊర్లో ముగురు స్నేహితులు ఉన్నారు. వారిలో ఇద్దరు 16 ఏండ్ల వయస్సు కలిగినవారు కాగా, మరొక బాలుడికి 15 ఏండ్లు. ముగ్గురూ ఆడుకోవడం, కలిసి తిరగడం వంటివి చేసేవారు. రాత్రి పొద్దుపోయేవరకు ఫోన్లలో ఆటలాడటం వారికి పరిపాటిగా మారింది. ఈ క్రమంలో వారు చెడు వ్యసనాలపైపు మల్లారు. ఇది నచ్చని 15 ఏండ్ల పిల్లాడు.. ఆ ఇద్దరి కుటుంబ సభ్యులకు వారి అలవాట్లను గురించి చెప్పాడు. దీంతో అతనిపై ఆగ్రహంతో ఉన్న వారు సమయం చూసుకుని గత శుక్రవారం అతన్ని హత్యచేశారు. అనంతరం అతని మృతదేహాన్ని సమీపంలోని గనిలో పాతిపెట్టారు. తమ కుమారుడు ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన వారి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.
దీంతో వారు మిగిలిన ఇద్దరు స్నేహితులపై దృష్టిసారించారు. పోలీస్ మార్కు విచారణతో వారు అసలు విషయం బయటపెట్టారు. తమ గురించి ఇంట్లో చెప్పడంతోనే అతన్ని చంపినట్లు చెప్పారని పోలీసులు వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
గుజరాత్లో భూకంపం
పల్లెపై పర్యవేక్షణ
నేడే అందుబాటులోకి ‘2-డీజీ’
ఆర్టీపీసీఆర్లో తేలకుంటే మరో టెస్టు
మృత్యుంజయులు!
చేయని తప్పుకు శిక్ష.. 550 కోట్ల పరిహారం!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

