ప్రధాని మోదీపై పోస్టర్లు.. 17 మంది అరెస్టు

న్యూఢిల్లీ: కరోనా కల్లోలం నుంచి బైటపడే మార్గాలుఅన్వేషించే కన్నా విమర్సించేవారి నోల్లు మూయించడం మీదనే కేంద్ర సర్కారు ఎక్కువగా దృష్టి పెడుతున్నట్టు కనిపిస్తున్నది. కరోనా నియంత్రణలో, చికిత్స, టీకాల సౌకర్యాలు కల్పించడంలో కంద్రం అలసత్వం చూపిందని దేశం లోపలా, వెలుపలా విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. దిద్దుబాటు చర్యల మాటేమోగానీ ముందు విమర్శలపై కొరడా ఝళిపిస్తున్నది. మోదీ కరోనా విదానాలను ప్రశ్నిస్తూ ఢిల్లీలో ఇటీవల వెలిసిన పోస్టర్లపై పోలీసులు చర్య తీసుకున్నారు. వీటికి సంబంధించి వివిధ చట్టాల కింద 21 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి 17 మందిని అరెస్టు చేశారు. ఢిల్లీలోని నాలుగు డివిజన్లలో ఈ అరెస్టులు జరిగాయి. అంటే పైస్థాయి సమన్వయంతోనే ఇవి జరిగినట్టు భావిస్తున్నారు. మోదీజీ, ఆప్నే హారే బచ్చోకి వ్యాక్సిన్ విదేశ్ క్యూ భేజ్ దియా (మోదీ గారూ మీరు మా పిల్లల టీకాలు విదేశాలకు ఎందుకు పంపించారు?) అని ఓ పోస్టరులో ఉంది. “మరిన్ని ఫిర్యాదులు వస్తే మరిన్ని ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తాం.. ప్రస్తుత దర్యాప్తు కొనసాగుతున్నది. ఎవరి ప్రోత్సాహంతో ఈ పోస్టర్లు వేశారో తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాం” అని ఓ సీనియర్ పోలీసు అధికారి చెప్పారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
Vande Bharat Sleeper: రెండు కొత్త వందేభారత్ స్లీపర్ రైళ్లు.. రూటు, టైమింగ్ వివరాలు ఇవే
కోతుల బెడద నివారణకు చర్యలు.. సర్పంచ్, ఉప సర్పంచ్‌కు కాలనీవాసుల సన్మానం
ఉద్యమకారుల ముందస్తు అరెస్టు
‘ఈ 31న జరిగే టీపీఎఫ్ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

