శ్రీనగర్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు ముష్కరులు హతం
Nowgam | జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. శ్రీనగర్ జిల్లాలోని నౌగామ్ (Nowgam) ప్రాంతంలో
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. శ్రీనగర్ జిల్లాలోని నౌగామ్ (Nowgam) ప్రాంతంలో టెర్రరిస్టులు ఉన్నారనే నిర్ధిష్టమైన సమాచారంతో ఆర్మీ, జమ్ముకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టామని ఆర్మీ అధికారులు ప్రకటించారు. వారిని అన్సార్ ఘజ్వత్ ఉల్ హింద్ సంస్థకు చెందిన అజీజ్ రసీ నాజర్, షాహిద్ అహ్మద్‌గా గుర్తించామన్నారు.
పుల్వామాలో ఈ నెల 2న పశ్చిమబెంగాల్‌కు చెందిన మునీర్ ఇస్లామ్ అనే కార్మికుడిపై జరిగిన ఉగ్రదాడిలో వీరిద్దరి హస్తముందని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో ఏకే రైఫిల్, రెండు పిస్తోల్లు, ఆయుధ సమాగ్రిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
J&K | A joint cordon & search operation was launched by Army & JKP at Dangerpur, Naugam, Srinagar. Op resulted in neutralisation of 2 hard-core terrorists of proscribed terrorist outfit AGuH. An AK Rifle, 2 pistols & other war-like stores recovered: Defence PRO Srinagar
— ANI (@ANI) September 15, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

