న్యూ ఇయర్ వేడుకలపై నిఘా కన్ను.. 18వేల మంది మోహరింపు..!
Drink Driving | న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు నిఘా పెట్టారు. నగరంలో భద్రత కల్పించేందుకు 18వేల బలగాలను మోహరించినట్లు అధికారులు పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలుంటాయని చెప్పారు. మేరకు నగరంలో 125 చోట్ల
న్యూఢిల్లీ : న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు నిఘా పెట్టారు. నగరంలో భద్రత కల్పించేందుకు 18వేల బలగాలను మోహరించినట్లు అధికారులు పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలుంటాయని చెప్పారు. మేరకు నగరంలో 125 చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. గతేడాది నూతన సంవత్సరం సందర్భంగా 657 చలాన్లు జారీ చేయగా, అందులో 36 మంది మద్యం తాగి వాహనాలు నడిపినందుకు సంబంధించినవని ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు.
శనివారం రాత్రి 8 గంటల నుంచి కన్నాట్ ప్లేస్‌లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని, మద్యం తాగి వాహనాలు నడిపే వారిని తనిఖీ చేసేందుకు ఆల్కోమీటర్లను ఉపయోగించనున్నట్లు పేర్కొన్నారు. ప్రత్యేక పోలీస్ కమిషనర్ (లా అండ్ ఆర్డర్) దేవేంద్ర పాఠక్ మాట్లాడుతూ.. నూతన సంవత్సరం సందర్భంగా భద్రత ఏర్పాట్లను చేసినట్లు పేర్కొన్నారు. శనివారం నగరవ్యాప్తంగా 16,500 మంది సిబ్బందిని పోలీసు బలగాలను, మరో 20కిపైగా కంపెనీలను మోహరించనున్నట్లు వివరించారు. మహిళా భద్రతపై పోలీసుల దృష్టి కేంద్రీకరిస్తామని, నగరంలో 2,500 మందికి పైగా మహిళా సిబ్బందిని మోహరిస్తామని పాఠక్ చెప్పారు.
తనిఖీల కోసం 1,600 పికెట్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 1,200 మొబైల్ పెట్రోలింగ్ వాహనాలు, 2,074 మోటార్‌బైక్‌లు బలగాలు ఉంటాయని వివరించారు. స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) ఎస్ఎస్ యాదవ్ మాట్లాడుతూ జాయింట్ చెకింగ్ కోసం స్థానిక పోలీసు సిబ్బందితో పాటు ట్రాఫిక్ పోలీసుల నుంచి దాదాపు 1,850 మంది సిబ్బందిని మోహరించనున్నట్లు వివరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ 125 పాయింట్లను గుర్తించామని, కన్నాట్ ప్లేస్‌లోకి ప్రవేశించడానికి ట్రాఫిక్ పరిమితం చేయనున్నట్లు వివరించారు. మద్యం తాగి వాహనాలు నడపడం, మైనర్లు వాహనాలు నడపడం, కార్ల అద్దాలపై బ్లాక్ ఫిల్మ్ ఉంటే చర్యలు తీసుకుంటామన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

