Kashmir | కశ్మీర్ లోయలో తగ్గిన ఉగ్రవాదం.. 172 మంది ఉగ్రవాదుల హతం!
Kashmir | ఈ ఏడాది జరిగిన ఎన్కౌంటర్లలో 172 మంది ఉగ్రవాదులు హతం అయ్యారని జమ్ముకశ్మీర్ ఏడీజీపీ విజయ్‌కుమార్ తెలిపారు.
Kashmir | కశ్మీర్ లోయలో 2022లో 42 మంది విదేశీ ఉగ్రవాదులతోపాటు మొత్తం 172 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టామని జమ్ము కశ్మీర్ అదనపు డీజీపీ విజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఉగ్రవాద సంస్థల్లో యువత చేరికలు 37 శాతం తగ్గుముఖం పట్టాయని ట్వీట్ చేశారు. కశ్మీర్ లోయలో ఉగ్రవాద కార్యకలాపాలు, భద్రతా బలగాల దాడులపై శనివారం ఆయన వరుస ట్వీట్లు చేశారు. కశ్మీర్లో భద్రతా బలగాలు 93 ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్స్ చేపట్టాయని తెలిపారు. భద్రతాదళాల ఎదురుకాల్పుల్లో మరణించిన ఉగ్రవాదుల్లో 108 మంది లష్కర్-ఏ-తొయిబా, 35 మంది జైషే మహమ్మద్, 22 మంది హిజ్బుల్ ముజాహిద్దీన్, నలుగురు ఆల్ బాద్ర్, ముగ్గురు అన్సార్ గజ్వాత్ ఉల్ హింద్ ఉగ్రవాదులు ఉన్నారు.
భద్రతాదళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎదురు కాల్పులు, ఉగ్రవాద దాడుల్లో 14 మంది జమ్ముకశ్మీర్ పోలీసులతోపాటు 26 మంది భద్రతా దళాల జవాన్లు ప్రాణాలు కోల్పోయారని విజయ్‌కుమార్ తెలిపారు. ఉగ్రదాడుల్లో 29 మంది పౌరులు మృతి చెందారన్నారు. ఈ ఏడాది కొత్తగా 100 మంది ఉగ్రవాద సంస్థల్లో చేరారని, గతేడాదితో పోలిస్తే ఇది 37 శాతం తక్కువ అన్నారు. వారిలో 74 మంది లష్కరే తొయిబాలో చేరారని వెల్లడించారు. కొత్తగా ఉగ్రవాద సంస్థల్లో చేరిన వారిలో 65 మంది ఎన్కౌంటర్లలో హతం అయ్యారని తెలిపారు.
17 మంది ఉగ్రవాదులు అరెస్ట్ కాగా, 18 మంది కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని విజయ్ కుమార్ చెప్పారు. ఎన్కౌంటర్లలో మరణించిన ఉగ్రవాదుల నుంచి 121 ఏకే సిరీస్ రైఫిళ్లతోపాటు ఎనిమిది ఎం4 కార్బైన్, 231 పిస్టళ్లతోపాటు మొత్తం 360 ఆయుధాలు జప్తు చేశామన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

