16th Finance Commission | ఆర్థిక సలహాదారు సహా మూడు కొత్త పోస్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం..!
16th Finance Commission | 16వ ఆర్థిక సంఘం ఏర్పాటుపై కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కొత్తగా మూడుపోస్టులకు ఆమోదముద్ర వేసింది
16th Finance Commission | 16వ ఆర్థిక సంఘం ఏర్పాటుపై కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కొత్తగా మూడుపోస్టులకు ఆమోదముద్ర వేసింది. కొత్తగా ఆర్థిక సలహాదారు, ఇద్దరు జాయింట్ సెక్రెటరీ పోస్టులను సృష్టించినట్లు కేంద్రం తెలిపింది. కమిషన్‌కు సహాయం అందించేందుకు ఈ పోస్టులను కొత్తగా తీసుకువచ్చినట్లు పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 280 కింద ఇచ్చిన అధికారాలను ఉపయోగించి ఫైనాన్స్ కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
రెండున్నర వారాల క్రితమే కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటుపై, 16వ ఫైనాన్స్ కమిషన్ కోసం పోస్టుల సృష్టికి డిసెంబర్ 31, 2023న నోటిఫికేషన్ విడుదల చేయగా.. తాజాగా కేబినెట్ సమావేశంలో అధికారికంగా ఆమోదం తెలిపినట్లు కేంద్రం పేర్కొంది. కమిషన్‌పై ఉన్న పనిభారాన్ని పరిగణలోకి తీసుకొని ఆర్థిక సలహాదారు. ఇద్దరు జాయింట్ సెక్రెటరీ పోస్టులను తీసుకువచ్చినట్లు తెలిపింది. ముగ్గురు అధికారులు 16వ ఆర్థిక సంఘానికి ఎలాంటి ఆటంకం లేకుండా సజావువుగా పనులు పూర్తి చేసేందుకు సహకారం అందిస్తారని పేర్కొంది.
గతేడాది డిసెంబర్ 31న నోటిఫికేషన్లో కేంద్ర ప్రభుత్వం 16వ ఆర్థిక సంఘం చైర్మన్‌గా నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియాగా నియమించింది. కమిషన్ కార్యదర్శిగా రిత్విక్ రంజనం పాండే బాధ్యతలు అప్పగించింది. కమిషన్ నివేదికను అక్టోబర్ 31, 2025 నాటికి రాష్ట్రపతికి సమర్పించనున్నది. విపత్తు నిర్వహణ చట్టం, 2005 కింద విపత్తు నిర్వహణ కార్యక్రమాలకు నిధుల కోసం ప్రస్తుత ఏర్పాటును కమిషన్ సమీక్షిస్తుంది. అలాగే కేంద్రం, రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీ, ఆదాయాన్ని పెంచేందుకు సూచనలు చేస్తుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ ఆరోగ్యంపై ఆందోళన.. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
Jailer 2 | 200 మంది అమ్మాయిలతో ‘తలైవా’ డ్యాన్స్.. థియేటర్లలో ఆ సీన్స్ మిస్!
Ranabaali | రణబాలి బాక్సాఫీస్ సెన్సేషన్.. వర్కింగ్ డేలోనూ అదరగొట్టిన విజయ్ దేవరకొండ!
Rowdy-sheeter | పోలీసింగ్ ఎక్కడ? ఏం చేస్తారో చేసుకోండన్న యువకుడు
RC 17 | ఆ తేదీన రామ్ చరణ్-సుక్కూ మూవీ ఓపెనింగ్.. ‘ఆర్సీ 17’ మ్యూజిక్ డైరెక్టర్‌పై మైత్రీ నిర్మాత క్లారిటీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

