కరోనా వ్యాక్సినేషన్లో మరో మైలురాయి.. 162 కోట్ల డోసుల పంపిణీ
Corona vaccination | కరోనాపై పోరులో భారత్ మరో మైళురాయిని అధిగమించింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 162 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది

న్యూఢిల్లీ: కరోనాపై పోరులో భారత్ మరో మైలురాయిని అధిగమించింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 162 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. కరోనా వ్యాక్సినేషన్‌ను గతేడాది జనవరి 16న ప్రారంభించారు. విడతల వారీగా వ్యాక్సినేషన్ చేస్తూ వస్తున్నారు.
ప్రస్తుతం 15-18 ఏండ్ల మధ్యవయస్కులకు టీకా పంపిణీ చేస్తున్నారు. అదేవిధంగా 60 ఏండ్లు పైబడినవారికి బూస్టర్ డోస్ ఇస్తున్నారు. మార్చి నెలలో 12 నుంచి 15 ఏండ్ల బాలలకు వ్యాక్సిన్ పంపణీని ప్రారంభించడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతున్నది.
కాగా, దేశంలో ఇప్పటివరకు 88,57,74,825 మంది మొదటి డోసు వేయగా, 68,39,22,086 మంది పూర్తిస్థాయిలో టీకా తీసుకున్నారు. ఇక 15 నుంచి 18 ఏండ్ల టీనేజర్లలో 4,15,77,103 మందికి వ్యాక్సిన్ మొదటి డోసు ఇవ్వగా, 80,10,256 మందికి ప్రికాషనరీ డోస్ పంపిణీ చేశారు. మొత్తంగా వ్యాక్సినేషన్లో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉన్నది. రాష్ట్రంలో 24,78,08,474 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. ఇక మహారాష్ట్రలో 14,60,43,724 డోసులను పంపిణీ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Train Trailer | మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు విజయ్ సేతుపతి.. ఆకట్టుకుంటున్న ‘ట్రైన్’ ట్రైలర్!
Diksha Divas | ముఖ్రా (కె) గ్రామంలో ఒకరోజు ముందే దీక్షా దివస్.. కేసీఆర్ చిత్రపటానికి పూలు, పాలతో అభిషేకం.. Video
Ramayana | బాహుబలి 2 రికార్డు బద్దలు కొట్టిన ‘రామాయణ’.. 23 రోజుల్లోనే రూ.1,790 కోట్ల వసూళ్లు
Mysaa | ‘మైసా’ క్లైమాక్స్ నచ్చలేదా? రష్మిక సినిమా వాయిదా వెనుక అసలు కారణం ఇదేనా!
Anil Ravipudi | అనిల్ రావిపూడి రామాయణం.. త్వరలోనే యానిమేషన్ మూవీ,స్వయంగా ప్రకటించిన స్టార్ డైరెక్టర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

