న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: మెటా ప్లాట్ఫామ్ భారీ ఎత్తున ఉద్యోగ కోతలకు సిద్ధమవుతున్నది. రానున్న నెలల్లో ఆ కంపెనీలో 16,000 మంది తమ ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉన్నది. రాయిటర్స్ కథనం ప్రకారం ఉద్యోగాల కోతలో మొదటి దశ మే 20న ప్రారంభం కానున్నది. దీనివల్ల దాదాపు 8,000 మంది ఉద్యోగులు ప్రభావితం అవుతారు. ఈ కోతల వల్ల కేవలం తొలి దశలోనే ప్రపంచవ్యాప్త ఉద్యోగుల్లో సుమారు 10 శాతం మంది ప్రభావితం అవుతారని అంచనా. ఈ తొలగింపుల పూర్తి స్థాయిని కంపెనీ అధికారికంగా ధ్రువీకరించనప్పటికీ 2026 చివరలో మరి న్ని ఉద్యోగ కోతలు ఉంటాయని, దీనితో ప్రభావితమయ్యే ఉద్యోగుల మొత్తం సంఖ్య సుమారు 16 వేలకు చేరవచ్చని రాయిటర్స్ పేర్కొన్నది.