NEET-PG Councelling | 2 రౌండ్ల కౌన్సెలింగ్ తర్వాతా 13వేల పీజీ మెడికల్ సీట్లు ఖాళీ..!
NEET-PG Councelling | పీజీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నీట్-పీజీ ఎంట్రన్స్ క్వాలిఫయింగ్ పర్సంటైల్ జీరోకు తగ్గించినా.. రెండు రౌండ్ల కౌన్సిలింగ్ పూర్తయిన తర్వాత దాదాపు 13 వేల పీజీ మెడికల్ సీట్లు ఖాళీగా ఉన్నాయి.
NEET-PG Councelling | పీజీ మెడికల్ కోర్సుల్లో చేరడానికి నీట్-పీజీ ఎంట్రన్స్ నిర్వహిస్తోంది కేంద్రం. ఈ విద్యా సంవత్సరంలో రెండు విడుతల కౌన్సిలింగ్ ముగిసిన తర్వాత దేశవ్యాప్తంగా పీజీ కోర్సుల్లో దాదాపు 13 వేల పీజీ మెడికల్ సీట్లు ఖాళీగా ఉన్నాయని కేంద్ర వైద్యారోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. అయినప్పటికీ నీట్-పీజీ ఎంట్రన్స్‌లో క్వాలిఫయింగ్ మార్క్స్ పర్సంటైల్ జీరోకు తగ్గించడం సరైన చర్యేనని ఆ వర్గాల కథనం.
కేంద్ర వైద్యారోగ్యశాఖ వర్గాల కథనం ప్రకారం దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో మొత్తం 68,142 పీజీ మెడికల్ సీట్లు ఉన్నాయి. వీటిని నీట్-పీజీ ఎంట్రన్స్ ద్వారా భర్తీ చేస్తారు. ఈ ఏడాది ఈ ఎంట్రన్స్‌కు 2.2 లక్షల మంది మెడికల్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు హాజరయ్యారు.
తొలుత క్వాలిఫయింగ్ పర్సంటైల్ 50 శాతంగా కేంద్రం నిర్ణయించింది. అంటే 50 శాతం మంది అభ్యర్థులు తమ ర్యాంకులను బట్టి కౌన్సెలింగ్‌కు హాజరు కావచ్చు. కానీ, రెండు రౌండ్ల కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాత కూడా భారీగా సీట్లు మిగిలిపోయాయి. గతేడాది కూడా క్వాలిఫయింగ్ పర్సంటైల్ 20 శాతానికి తగ్గించి.. ఖాళీ సీట్లను భర్తీ చేశారని ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

