కొవిడ్-19 మందుల బ్లాక్ మార్కెటింగ్ : 133 మందిపై కేసులు నమోదు

ముంబై : మహారాష్ట్రలో గత కొద్దినెలలుగా కొవిడ్-19 చికిత్సలో ఉపయోగించే ఔషధాలను అక్రమంగా విక్రయిస్తున్న 133 మందిపై ఫుడ్, డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) అధికారులు కేసులు నమోదు చేశారు. రెమ్డిసివిర్, టొలిసిజుమాబ్ ఇంజక్షన్లు సహా ఇతర ఔషధాలను అక్రమంగా విక్రయిస్తున్న వీరిపై కేసులు బనాయించామని ఎఫ్‌డీఏ అధికారులు బొంబాయి హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో పేర్కొన్నారు.
కొవిడ్-19 చికిత్సలో వాడే మందుల బ్లాక్ మార్కెటింగ్ పై అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా ఎఫ్‌డీఐ ఈ అఫిడవిట్ ను కోర్టుకు సమర్పించింది. కరోనా మందుల బ్లాక్ మార్కెటింగ్ కు అడ్డుకట్ట వేసేందుకు మహారాష్ట్ర పోలీసులతో కలిసి పనిచేస్తున్నామని ఎఫ్‌డీఏ పేర్కొంది.
నవిముంబై, ముంబై, పుణే వంటి ప్రాంతాల్లో బ్లాక్ మార్కెటీర్లపై కేసులు నమోదు చేసినట్టు వెల్లడించింది. ఎలాంటి లైసెన్సులు లేకుండా అధిక ధరలకు ట్రేడర్లు ఈ మందులను అమ్ముతున్నారని తెలిపింది. నిందితుల నుంచి పెద్ద సంఖ్యలో ఔషధాలు, ఇంజెక్షన్లను అధికారులు స్వాదీనం చేసుకున్నారని పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

