Road Accident | పెండ్లి ట్రాక్టర్ బోల్తా.. నలుగురు చిన్నారులు సహా 13 మంది మృతి
మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడటంతో 13మంది మృతి చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారిలో నలుగురు చిన్నారులు ఉన్నారు.
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడటంతో 13మంది మృతి చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారిలో నలుగురు చిన్నారులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.
రాజస్థాన్‌లోని మోతీపురాకు చెందిన 30 మంది మధ్యప్రదేశ్‌లోని కులంపూర్‌లో జరిగే పెండ్లికి ట్రాక్టర్లో బయల్దేరారని, రాజ్‌గఢ్ జిల్లాలోని పీప్ లోడీ సమీపంలోకి రాగానే ప్రమాదవశాత్తు ట్రాక్టర్ ట్రాలీ బోల్తాపడిందని పోలీసులు తెలిపారు. గాయపడినవారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని, మెరుడైన చికిత్స కోసం వారిని భోపాల్‌కు తరలించామన్నారు. కాగా, ఈ ఘటనపై సీఎం మోహన్ యాదవ్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలు, బాధితులకు ఎక్స్ వేదికగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం తెలిపారు. ఘటన స్థలానికి రాజ్‌గఢ్ జిల్లా కలెక్టర్, ఎస్పీ, మంత్రి నారాయణ్ సింగ్ పన్వార్ చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారని సీఎం మోహన్ యాదవ్ చెప్పారు. రాజస్థాన్ ప్రభుత్వం, పోలీసులతో టచ్‌లో ఉన్నామన్నారు. రాజస్థాన్ పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకున్నారని తెలిపారు. గాయపడినవారు రాజగఢ్ దవాఖానలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. మరి కొంతమందిని భోపాల్ తరలించామన్నారు. వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

