fire breaks | చైనా (China)లో ఘోర ప్రమాదం (fire breaks) చోటు చేసుకుంది. హెనాన్ ప్రావిన్స్ (Henan province)లోని ఓ పాఠశాల (boarding school) వసతి గృహంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో యింగ్‌కాయ్ పాఠశాల వసతి గృహంలో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 13 మంది విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది చిన్నారులు త్రీవంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన చిన్నారులను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు ఘటనపై అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు.
Also Read..
PM Modi | స్టేజ్‌పైకి వెళ్తూ పడిపోబోయిన సీఎం స్టాలిన్.. సాయం చేసిన ప్రధాని మోదీ
Worlds largest lock | అయోధ్య చేరుకున్న ప్రపంచంలోనే అతిపెద్ద బాహుబలి తాళం