Annamalai | ‘12 ఏళ్లుగా అధికారంలో ఉన్నా, శతృవులను సృష్టించుకోవాల్సి వస్తున్నది’.. బీజేపీపై అన్నామలై విమర్శలు
Annamalai | తమిళనాడులో ఐదేళ్లపాటు బీజేపీకి నాయకత్వం వహించి ఆ పార్టీని వీడిన కే అన్నామలై కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. 12 ఏళ్లుగా అధికారంలో ఉన్నా, ఇప్పటికీ శత్రువులను సృష్టించుకోవాల్సి వస్తోందని విమర్శించారు.
చెన్నై: తమిళనాడులో ఐదేళ్లపాటు బీజేపీకి నాయకత్వం వహించి ఆ పార్టీని వీడిన కే అన్నామలై కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. 12 ఏళ్లుగా అధికారంలో ఉన్నా, ఇప్పటికీ శత్రువులను సృష్టించుకోవాల్సి వస్తోందని విమర్శించారు. (Annamalai) జూన్‌లో బీజేపీకి రాజీనామా చేసిన అన్నామలై, ‘వీ ద లీడర్స్’ అనే కొత్త సంస్థను ప్రారంభించారు. ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసనల పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఆయన తప్పుపట్టారు. నిరసనకారులపై పోలీస్ బలగాలను ప్రయోగించడం, ముందస్తు నిర్బంధాలు, నిరసనల అణచివేతకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను ఆయన విమర్శించారు.
కాగా, నిరసన తెలిపే హక్కును, ప్రభుత్వానికి వ్యతిరేక గళాలను ‘దేశ వ్యతిరేక’ చర్యలుగా చిత్రీకరించే ధోరణిని అన్నామలై ప్రశ్నించారు. ‘కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో 12 ఏళ్లకు పైగా అధికారంలో ఉందనే విషయాన్ని మరిచిపోయి, తమ ఉనికిని కాపాడుకోవడానికి నిరంతరం ఏదో ఒక శత్రువును సృష్టించుకుంటోందని నాకు అనిపిస్తోంది. ఇది చాలా బాధాకరం’ అని ఎక్స్‌లో వరుస పోస్టులతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Annamalai | ‘12 ఏళ్లుగా అధికారంలో ఉన్నా, శతృవులను సృష్టించుకోవాల్సి వస్తున్నది’.. బీజేపీపై అన్నామలై విమర్శలు
NZvIND: గ్లెన్ ఫిలిప్స్ 82 నాటౌట్.. ఇండియా టార్గెట్ 226
Harish Rao | 12 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోతుంది.. ఇప్పటికీ మన ప్రభుత్వం కరువు మండలాలు ప్రకటించలేదు : హరీశ్ రావు
Saudi Arabia | సౌదీ అరేబియాలో ఎయిర్‌పోర్టుపై హౌతీల దాడి.. భారతీయుడు సహా ఇద్దరు మృతి
రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి : బీవీ రాఘవులు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

