Omicron variant: ఢిల్లీ ఆస్పత్రిలో 12 మంది ‘ఒమిక్రాన్’ అనుమానితులు..!
Omicron variant: ఇప్పటిదాకా విదేశాల్లో విజృంభించిన కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు మన దేశంలోనూ కలకలం రేపుతున్నది. ఇప్పటికే కర్ణాటక రాజధాని బెంగళూరులో

న్యూఢిల్లీ: ఇప్పటిదాకా విదేశాల్లో విజృంభించిన కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ( Omicron variant ) ఇప్పుడు మన దేశంలోనూ కలకలం రేపుతున్నది. ఇప్పటికే కర్ణాటక రాజధాని బెంగళూరులో రెండు ఒమిక్రాన్ కేసులు నిర్ధారణ కాగా.. ఇప్పుడు ఢిల్లీలోని లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ (LNGP) చికిత్స పొందుతున్న కరోనా బాధితుల్లో 12 మందికి ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్లు అనుమానిస్తున్నారని విశ్వసనీయ సమాచారం.
విశ్వసనీయ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. LNGPలో గురువారం 8 మంది ఒమిక్రాన్ అనుమానితులు చేరగా, ఇవాళ మరో నలుగురు అనుమానితులు చేరినట్లు తెలిసింది. ఇవాళ ఆస్పత్రిలో చేరిన నలుగురిలో ఇద్దరు యూకేకు చెందినవారు కాగా, ఒకరు ఫ్రాన్స్‌కు, ఇంకొకరు నెదర్లాండ్స్‌కు చెందిన వారని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. బాధితుల శాంపిల్స్‌ను ఒమిక్రాన్ నిర్ధారణ కోసం జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించినట్లు తెలిసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

