ట్రయల్స్‌లో సత్ఫలితాలిస్తున్న 2డీజీ డ్రగ్: డీఆర్డీవో శాస్త్రవేత్త
2-DG drug: క్లినికల్ ట్రయల్స్‌లో 2-డీఆక్సీ-డీ-గ్లూకోజ్ (2-డీజీ) డ్రగ్ సత్ఫలితాలను ఇస్తున్నదని డీఆర్డీవోకు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ & అల్లయిడ్ సైన్సెస్ శాస్త్రవేత్త

న్యూఢిల్లీ: క్లినికల్ ట్రయల్స్‌లో 2-డీఆక్సీ-డీ-గ్లూకోజ్ (2-డీజీ) డ్రగ్ సత్ఫలితాలను ఇస్తున్నదని డీఆర్డీవోకు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ & అల్లయిడ్ సైన్సెస్ శాస్త్రవేత్త డా.సుధీర్ చాంద్నా చెప్పారు. ఫేజ్-2 ట్రయల్స్‌లో 110 మంది, ఫేజ్-3 ట్రయల్స్‌లో 220 మంది పేషెంట్లు పాల్గొన్నారని, ఫేజ్-2లో మంచి ఫలితాలు కనిపించాయని తెలిపారు. ప్రస్తుతం ప్రామాణికంగా వినియోగిస్తున్న మందులతో పోల్చితే.. 2-డీజీ ఔషధం తీసుకున్న కరోనా బాధితులు రెండు, మూడు రోజులు ముందుగానే కోలుకుంటున్నారని చాంద్నా వెల్లడించారు.
ఇక, ఫేజ్-3 ఫలితాలు కూడా అశాజనకంగానే ఉన్నాయని శాస్త్రవేత్త సుధీర్ చాంద్నా తెలిపారు. ఇప్పుడు ప్రామాణికంగా వినియోగంలో ఉన్న ఔషధాలు తీసుకుంటున్న కరోనా బాధితుల్లో 31 శాతం మందికి మూడో రోజు నుంచి ఆక్సిజన్ అవసరం తగ్గుతుండగా.. 2-డీజీ డ్రగ్ తీసుకున్న కరోనా బాధితుల్లో మాత్రం 42 శాతం మందికి మూడో రోజు తర్వాత కృత్రిమ శ్వాస నుంచి విముక్తి లభిస్తున్నదని ఆయన వెల్లడించారు. ఈ డాటాను బట్టివ ప్రస్తుతం వినియోగంలో ఉన్న కొవిడ్ ఔషధాల కంటే.. కొత్తగా రానున్న 2-డీజీ ఔషధమే మెరుగైన ఫలితాలు ఇస్తుందనే విషయం స్పష్టమైందన్నారు.
అయితే, ఈ 2-డీజీ డ్రగ్ ధర ఎంత అనేది ఆ ఔషధం ఉత్పత్తి వ్యయం, తదితర అంశాలపై ఆధారపడి ఉంటుందని సుధీర్ చాంద్నా చెప్పారు. తమ ఇండస్ట్రీ పార్ట్నర్ అయిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ 2-డీజీ డ్రగ్ ధరను ఖరారు చేస్తుందన్నారు. ఈ ఔషధాన్ని త్వరలోనే మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ ప్రయత్నిస్తున్నదని చెప్పారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
301 జిల్లాల్లో 20 శాతానికిపైగా పాజిటివిటీ రేటు: కేంద్రం
కాబూల్ పేలుళ్లు: 50 దాటిన మృతుల సంఖ్య
క్షణికావేశంలో భార్యను చంపి భర్త ఆత్మహత్య
పండ్లలో విటమిన్.. ఇమ్యూనిటీ పెంచెన్
మైదా పిండి.. కొడుతుందట ఆరోగ్యానికి గండి..!
మహమ్మారి మరణ మృదంగం.. వరుసగా రెండో రోజూ 4 వేలకుపైగా మృతులు
గోమూత్రం తాగండి.. కరోనాను నిలువరించండి: బీజేపీ ఎమ్మెల్యే సలహా
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

