Saryu Canal | సరయూ కాలువలోకి దూసుకెళ్లిన కారు.. 11 మంది మృతి
ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) గోండాలో ఘోర ప్రమాదం చోటు చేసుకొంది. 15 మంది భక్తులతో వెళ్తున్న బొలెరో వాహనం పరాసరాయ్-ఆలవాల్ డియోర మార్గంలోని రేహారి గ్రామం వద్ద అదుపుతప్పి సరయూ కాలువలో (Saryu Canal) పడిపోయింది.
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) గోండాలో ఘోర ప్రమాదం చోటు చేసుకొంది. 15 మంది భక్తులతో వెళ్తున్న బొలెరో వాహనం పరాసరాయ్-ఆలవాల్ డియోర మార్గంలోని రేహారి గ్రామం వద్ద అదుపుతప్పి సరయూ కాలువలో (Saryu Canal) పడిపోయింది. దీంతో కారులో ఉన్న 11 మంది జలసమాధి అయ్యారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులంతా మోతీగంజ్ పోలీస్ పరిధిలోని సిహాగావ్కు చెందిన వారని, పృథ్వీనాథ్ ఆలయానికి (Prithvinath temple) వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో 15 మంది ఉన్నారని, నలుగురిని స్థానికులు కాపాడినట్లు చెప్పారు.
కాగా, ప్రమాద ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం వ్యక్తం చేశారు. తమ ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులకు సూచించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యచికిత్స అందజేయాలని ఆదేశించారు.
CM Yogi Adityanath has taken cognisance of the accident in Gonda and expressed condolences to the bereaved families. He has directed the officials to reach the spot and speed up the relief operations. He has also directed for the proper medical treatment of the injured: Uttar… https://t.co/af9KZa20Bs
— ANI (@ANI) August 3, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
6 నెలల్లో 23 మరణశిక్షలు.. జడ్జి బదిలీ
సామాన్యుడిపై మరో పిడుగు.. పెరగనున్న సబ్బులు, వంటనూనెల ధరలు
Congress | ‘పట్టభద్రుల’ భయంలో కాంగ్రెస్ సర్కార్.. హైదరాబాద్‌లో నిరసన రద్దు.. ఢిల్లీకి పరుగు
KTR | కేటీఆర్‌తో యువ న్యాయవాదుల భేటీ.. సామాన్యులకు న్యాయం కోసం నిబద్ధతతో పనిచేయాలని లాయర్లకు పిలుపు
Tummidihatti Barrage | ‘తమ్మిడిహట్టి’పై ‘మహా’ సస్పెన్స్.. 152 మీటర్ల ఎత్తుకు ఫడ్నవీస్ ఓకే చెప్తారా?
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

