Ricky Kej: బ్రిటీష్ ఆర్కెస్ట్రాతో జన గణ మణ.. వీడయో పోస్టు చేసిన రిక్కీ కేజ్
British orchestra: ఆర్కెస్ట్రాలో జాతీయ గీతం అదిరిపోయింది. కొత్త తరహా ఇన్స్టుమెంట్స్తో జన గణ మణ సాంగ్‌ను రికార్డు చేశారు. గ్రామీ అవార్డు గ్రహీత రిక్కీ కేజ్ ఆ సాంగ్‌ను రికార్డింగ్ చేశారు. లండన్‌లో అబ్బే స్టూడియోస్‌లో ఈ ఈవెంట్ జరిగింది. ఆ వీడియోపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు.
న్యూఢిల్లీ: గ్రామీ అవార్డు గ్రహీత రిక్కీ కేజ్(Ricky Kej).. భారత జాతీయ గీతాన్ని ఆర్కెస్ట్రాలో రికార్డింగ్ చేశారు. లండన్‌లో అబ్బే స్టూడియలో జన గణ మణ గీతాన్ని రికార్డు చేశారు. వంద మంది బ్రిటీష్ ఆర్కెస్ట్రాతో ఆ సాంగ్‌ను చేశారు. రాయల్ ఫిలార్మోనిక్ ఆర్కెస్ట్రాతో ఈ ఈవెంట్‌ను ఆర్గనైజ్ చేశారు. ప్రఖ్యాత అబ్బే రోడ్ స్టూడియోస్‌లో ఈ సాంగ్‌ను రికార్డు చేశారు. భారత జాతీయ గీతాన్ని ఇంత పెద్ద ఆర్కెస్ట్రాతో రికార్డు చేయడం ఇదే మొదటిసారి. చాలా అత్యద్భుతంగా ఆ ఆర్కెస్ట్రా ప్రదర్శన ఇచ్చింది. ఆ ఆర్కెస్ట్రా వీడియోను రిక్కీ కేజ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దానిపై ప్రధాని మోదీ రియాక్ట్ అయ్యారు. జన గణ మణపై ఆర్కెస్ట్రా రికార్డు చేసిన రిక్కీ కేజ్‌ను ప్రధాని మోదీ ప్రశంసించారు. ఇది ప్రతి భారతీయుడిని గర్వంగా నిలుపుతుందన్నారు.
A few days ago, I conducted a 100-piece British orchestra, The Royal Philharmonic Orchestra to perform India’s National Anthem at the legendary Abbey Road Studios, London. This is the largest orchestra ever to record India's National Anthem and it is spectacular! The "Jaya He" at… pic.twitter.com/sqJGW8mTDu
— Ricky Kej (@rickykej) August 14, 2023
రాయల్ ఫిలార్మోనిక్ ఆర్కెస్ట్రాకు బ్రిటన్‌లో ప్రత్యేక గుర్తింపు ఉన్నది. మోస్ట్ ఇన్ డిమాండ్ ఆర్కెస్ట్రాగా ఆ గ్రూపును గుర్తిస్తారు. 1946లో సర్ థామస్ బీచామ్ ఆ ఆర్కెస్ట్రాను స్థాపించారు. భారత స్వాతంత్య్రానికి ఒక ఏడాది ముందే ఆ ఆర్కెస్ట్రా గ్రూపు ప్రారంభమైంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

