న్యూఢిల్లీ: ప్రముఖ ఆడియో స్టోరీటెల్లింగ్ యాప్ పాకెట్ ఎఫ్ఎం 100-130 మంది ఉద్యోగులపై వేటు వేసినట్టు సమాచారం. మొత్తం ఉద్యోగుల్లో ఇది దాదాపు 10 శాతం. కంటెంట్ టీమ్‌లోనే తొలగింపులు జరిగినట్టు తెలిసింది. త్వరలో మరింత మందికి ఉద్వాసన పలుకనున్నట్టు సమాచారం. జూలై చివరినాటికి 15 శాతం మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు తెలిసింది. మరోవైపు 2 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను క్వెస్ కార్ప్ పేరోల్ కిందకు బదిలీ చేసినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.