Delhi Shootout | ఢిల్లీలో కాల్పులు.. ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు
Delhi Shootout | దేశ రాజధాని ఢిల్లీలో కాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో ఒక వ్యక్తి మరణించగా మరో ఇద్దరు గాయపడ్డారు. నిందితులైన ముగ్గురు యువకులు మరో చోట కూడా ఒక వ్యక్తి ఇంటి వద్ద కాల్పులు జరిపారు. చివరకు పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాల్పులు జరిగాయి. (Delhi Shootout) ఈ సంఘటనలో ఒక వ్యక్తి మరణించగా మరో ఇద్దరు గాయపడ్డారు. నిందితులైన ముగ్గురు యువకులు మరో చోట కూడా ఒక వ్యక్తి ఇంటి వద్ద కాల్పులు జరిపారు. చివరకు పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఈశాన్య ఢిల్లీలోని కబీర్ నగర్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి స్కూటర్‌పై ఇంటికి తిరిగి వస్తున్న నదీమ్, అతడి ఇద్దరు స్నేహితులపై బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఏడు రౌండ్లు కాల్పులు జరిపారు. ఆ తర్వాత నదీమ్ స్కూటర్, మొబైల్ ఫోన్ తీసుకుని పారిపోయారు. వారి బైక్‌ను అక్కడ వదిలేశారు.
కాగా, ఈ కాల్పుల సంఘటనలో నదీమ్ మరణించాడు. అతడి ఇద్దరు స్నేహితులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులైన ముగ్గురు మైనర్ బాలురను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. నిందితుల్లో ఒకరు నదీమ్ నుంచి అప్పు తీసుకున్నాడని, తిరిగి చెల్లించడంపై ఒత్తిడి చేయడంతో కాల్చి చంపారని వెల్లడించారు.
మరోవైపు ఈ ముగ్గురు యువకులు అదే రాత్రి వేళ జ్యోతి నగర్లో కూడా కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. రాహుల్ అనే వ్యక్తి ఇంటి బయట ఆరు రౌండ్లు కాల్పులు జరిపినట్లు చెప్పారు. అరెస్ట్ చేసిన వారి నుంచి మూడు కంట్రీ మేడ్ పిస్టల్స్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ రెండు కాల్పుల సంఘటనలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వివరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

