బెంగాల్లో దీదీ దూకుడు
మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ పశ్చిమబెంగాల్లో జోరు కనబరిచింది. బెంగాల్లో భారీగా సీట్లు సాధించాలన్న బీజేపీ ఆశలకు మమత గండికొట్టారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ టీఎంసీ దూసుకెళ్లింది. హోరాహోరీగా జరిగిన పోరులో టీఎంసీ తన పట్టును నిలుపుకొంది.
- ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులు
- పట్టును నిలుపుకొన్న మమతాబెనర్జీ
- బీజేపీకి ఊహించని ఎదురుదెబ్బ
కోల్‌కతా, జూన్ 4: మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ పశ్చిమబెంగాల్లో జోరు కనబరిచింది. బెంగాల్లో భారీగా సీట్లు సాధించాలన్న బీజేపీ ఆశలకు మమత గండికొట్టారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ టీఎంసీ దూసుకెళ్లింది. హోరాహోరీగా జరిగిన పోరులో టీఎంసీ తన పట్టును నిలుపుకొంది. రాష్ట్రంలో మొత్తం 42 ఎంపీ స్థానాలుండగా 29 స్థానాలను టీఎంసీ కైవసం చేసుకకున్నది. పశ్చిమబెంగాల్‌పై భారీగా ఆశలు పెట్టుకున్న బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ 12 స్థానాలకే పరిమితమైంది. మరోవైపు కాంగ్రెస్ ఒకేఒక్క స్థానంలో ఆధిక్యంలో ఉన్నది.
అభిషేక్ బెనర్జీకి భారీ మెజారిటీ…
ఇండియా కూటమికి దూరంగా ఉన్న టీఎంసీ ఈ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలో దిగి సత్తా చాటింది. బీజేపీని దీటుగా ఎదుర్కొంది. ఆ పార్టీ ముఖ్య నేతలు అభిషేక్ బెనర్జీ, మహువా మొయిత్రా, కీర్తి ఆజాద్, శతృఘ్నసిన్హా , క్రికెటర్ యూసుఫ్ పఠాన్ గెలుపు తీరాలకు చేరారు. అభిషేక్ బెనర్జీ 7 లక్షలకు పైగా మెజారిటీ సాధించడం గమనార్హం.
అధీర్ రంజన్ చౌదురీ ఓటమి…
ఈ ఎన్నికల్లో 2019 నాటి మ్యాజిక్‌ను రిపీట్ చేయడంలో బీజేపీ విఫలమైంది. గత ఆ పార్టీ 18 స్థానాల్లో గెలుపొందగా.. ఈ సారి 12 స్థానాలతోనే సరిపెట్టుకుంది. మరోవైపు కాంగ్రెస్ తీవ్రంగా నిరాశపరిచింది. ఆ పార్టీ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదురీ.. క్రికెటర్ యూసుఫ్ పఠాన్ చేతిలో ఓటమి పాలయ్యారు. కాగా, ఓట్ల శాతంలోనూ టీఎంసీ దూకుడు ప్రదర్శించింది. అధికార టీఎంసీ 47 శాతానికి పైగా ఓట్లను దక్కించుకోగా, బీజేపీ 37 శాతం, కాంగ్రెస్ 4 శాతం ఓట్లు దక్కించుకున్నాయి.
మోదీ-షా వ్యూహాలకు చెక్…
సార్వత్రిక ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీజేపీ, టీఎంసీ బెంగాల్లో హోరాహోరీగా తలపడ్డాయి. టీఎంసీని నిలువరించి, తద్వారా మమతాబెనర్జీని అడ్డుకోవాలనే ఉద్దేశంతో బీజేపీ వ్యూహాలు రచించింది. అందుకే బీహార్, ఉత్తరప్రదేశ్‌తో పాటు పశ్చిమబెంగాల్లోనూ ఏడు విడతల్లో ఎన్నికలు ఉండేలా ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేయించింది. అయితే బీజేపీ వ్యూహం ఫలించలేదు. బీజేపీ వ్యూహాన్ని గ్రహించిన మమతా బెనర్జీ సొంత రాష్ట్రంలో పట్టు నిలుపుకొనేందుకు ఇండియా కూటమికి సైతం దూరమయ్యారు. సొంత రాష్ర్టానికే పరిమితమై, అంతా తానై నడిపించారు. తద్వారా మోదీ-షా వ్యూహాలకు చెక్ పెట్టారు.
పశ్చిమబెంగాల్ (42)
టీఎంసీ 29
ఎన్డీయే 12
ఇండియా 1
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

