పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేశారా? ఇలా చేసుకోండి
పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేశారా |లింక్ చేయకపోతే తొందరపడండి. మార్చి 31లోపు పాన్ కార్డుతో ఆధార్‌ను అనుసంధానం చేయకపోతే భారీ మూల్యం తప్పదు.

మీ పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేశారా? లింక్ చేయకపోతే తొందరపడండి. మార్చి 31లోపు పాన్ కార్డుతో ఆధార్‌ను అనుసంధానం చేయకపోతే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఇప్పటికే పాన్‌తో ఆధార్ అనుసంధానానికి పలుమార్లు గడువు పొడిగించిన ఆదాయపు పన్ను శాఖ డెడ్‌లైన్ విధించింది. మార్చి 31లోపు పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేసుకోకపోతే రూ.10వేలు జరిమానా విధిస్తామని ప్రకటించింది. అందుకే గడువులోపు పాన్‌తో ఆధార్ కార్డును అనుసంధానం చేసుకోండి.. రెండు విధాలుగా ఈ ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం..
పాన్ కార్డుతో ఆధార్ లింక్ ఆన్లైన్లో..
- ముందుగా ఆదాయపు పన్ను శాఖ ఈ ఫైలింగ్ పోర్టల్ https://incometaxindiaefiling.gov.in/ ఓపెన్ చేయాలి.
- తర్వాత అందులో రిజిస్టర్ చేసుకోవాలి. పాన్ కార్డు నంబరే ఇక్కడ యూజర్ ఐడీగా ఉంటుంది.
- రిజిస్టర్ అయిన తర్వాత యూజర్ ఐడీ, పాస్వర్డ్, పుట్టిన తేదీ వివరాలతో లాగిన్ అవ్వాలి.
- లాగిన్ అవ్వగానే పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేసుకోవాలని ఒక పాప్ అప్ వస్తుంది.
- ఒకవేళ పాప్ అప్ రాకపోతే ప్రొఫైల్ సెట్టింగ్స్‌లోని లింక్ ఆధార్ పై క్లిక్ చేయాలి. అప్పుడు పాన్ కార్డులో ఉన్న మీ పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలు కనిపిస్తాయి. ఆధార్ కార్డులో ఉన్న వివరాలతో ఆ వివరాలు సరిపోయాయో చూసుకోవాలి. ఆ తర్వాత ఆధార్ నంబర్ ఎంటర్ చేసి link now బటన్‌పై క్లిక్ చేస్తే సరిపోతుంది.
- అప్పుడు ఆధార్ విజయవంతంగా అనుసంధానమైంది అని ఒక పాప్ అప్ వస్తుంది.
https://www.utiitsl.com/ లేదా https://www.egov-nsdl.co.in/ వఎవెబ్సైట్ల ద్వారా కూడా పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానం చేసుకోవచ్చు.
మొబైల్ ద్వారా
మన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 567678 లేదా 56161 నంబర్‌కు మెసేజ్ చేయడం ద్వారా కూడా పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానం చేసుకోవచ్చు. ఇందుకోసం రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 12 అంకెల ఆధార్ నంబర్ తర్వాత స్పేస్ ఇచ్చి 10 అంకెల పాన్ నంబర్‌ను ఎంటర్ చేసి ఎస్ఎంఎస్ చేయాలి.
లింక్ అవ్వకపోతే..
ఆధార్ కార్డు, పాన్ కార్డుల్లో పేరు, జెండర్, పుట్టిన తేదీ వంటి వివరాలు వేర్వేరుగా ఉంటే ఆధార్‌తో పాన్ కార్డు లింక్ అవ్వదు. అలాంటప్పుడు ఆధార్ కార్డులో తప్పుగా ఉన్న వివరాలను మార్చుకోవాలి. ఆ తర్వాత ఆధార్‌తో పాన్ కార్డు లింక్ చేసుకోవాలి. ఆధార్‌లో వివరాలను యూఐడీఏఐ వెబ్సైట్లోకి వెళ్లి మార్చుకోవచ్చు. ఒకవేళ పాన్ కార్డులో వివరాలను మార్చుకోవాలని అనుకుంటే https://www.onlineservices.nsdl.com/paam/endUserRegisterContact.html ద్వారా మార్చుకోవచ్చు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
పాన్ కార్డు లో అడ్రస్ మార్చుకోవడం ఎలా
ప్రూఫ్స్ లేకుండానే ఆధార్‌లో అడ్రస్ మార్చడమెలా
మీ ఆధార్‌ను ఎవరైనా వాడారా.. ఇలా తెలుసుకోండి
క్రెడిట్ కార్డు సైజ్‌లో ఆధార్.. అప్లై ఎలా చేయాలంటే..
ఆధార్ నంబర్ మర్చిపోయారా? ఇలా తెలుసుకోండి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

