పాన్ కార్డు లో అడ్రస్ మార్చుకోవడం ఎలా
పాన్ కార్డు | ఆర్థిక లావాదేవీలు జరపాలన్నా.. ఐటీ రిటర్న్‌లు చేయాలన్నా పాన్‌కార్డు కచ్చితంగా ఉండాలి. అందులో తప్పులు వస్తే అప్డేట్ చేసుకోవచ్చు.

పాన్ కార్డు ఆధార్ కార్డుతో పాటు పాన్ కార్డు ఇప్పుడు తప్పనిసరిగా మారింది. ఆర్థిక, బ్యాంకు లావాదేవీలు జరపాలన్నా.. ఐటీ రిటర్న్‌లు చేయాలన్నా పాన్‌కార్డు కచ్చితంగా ఉండాలి. ఒక్కసారి పాన్ కార్డు తీసుకున్నామంటే పాన్ నంబర్‌ను మార్చలేం. అయితే పాన్ కార్డులో పేరు, సంతకం, ఇతర వివరాలుఏవైనా తప్పులు వస్తే మాత్రం వాటిని అప్డేట్ చేసుకునే అవకాశం ఉంది. సాధారణంగా సొంత ఇళ్లు లేని వారు ఒక్కోసారి వేరే అడ్రస్‌కు మారిపోతుంటారు. అలాంటి సమయంలో పాన్ కార్డులో ఉన్న అడ్రస్‌ను మీ ఇంట్లో ఉండే సులువుగా అప్డేట్ చేసుకునే సదుపాయం ఉంది. పాన్ కార్డులో అడ్రస్‌ను ఆన్లైన్, ఆఫ్‌లైన్ రెండు విధాలుగా మార్చుకోవచ్చు. అదెలాగో చూద్దాం..
పాన్ కార్డు వివరాలు ఆఫ్‌లైన్‌లో మార్చుకోవడం ఎలా?
వివరాలు అప్డేట్ చేసేందుకు కొత్త పాన్ కార్డు లేదా పాన్ కరెక్షన్ ఫాం నింపాలి. ఏయే వివరాలు అప్డేట్ చేయాలని అనుకుంటున్నామో అన్నీ నింపాలి. ముఖ్యంగా కొత్త అడ్రస్‌ను తప్పులు లేకుండా నింపాలి.
మీరు ఏ అడ్రస్ అయితే అప్డేట్ చేయాలని అనుకుంటున్నారో ఆ అడ్రస్ ప్రూఫ్‌ను ఆ ఫాంతో జత చేయాల్సి ఉంటుంది.
ఆ తర్వాత దరఖాస్తు ఫాంను దగ్గరలోని పాన్ కేంద్రంలో సబ్మిట్ చేయాలి.
దరఖాస్తు పంపాల్సిన అడ్రస్ :
Income Tax PAN Services Unit,
5th Floor Mantri Sterling, Plot No. 341,
Survey No. 997/8, Model colony,
Near Deep Bungalow Chowk, Pune – 411 016
పాన్ కార్డు వివరాలు ఆన్లైన్లో మార్చుకోవడం ఎలా?
ముందుగా NSDL అధికారిక వెబ్సైట్ (https://www.onlineservices.nsdl.com/paam/endUserRegisterContact.html) ఓపెన్ చేయాలి.
ఆన్లైన్ పాన్ అప్లికేషన్ పేజిలో Application Type పై క్లిక్ చేసి Changes or Correction in existing PANS Data/Reprint of PAN Card ఆప్షన్ ఎంచుకోవాలి.
ఆ తర్వాత Individual పై క్లిక్ చేసి వ్యక్తిగత వివరాలు, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.
అప్పుడు కొత్త పేజిలో టోకెన్ నంబర్ వస్తుంది. దాన్ని సేవ్ చేసుకుంటే మంచిది.
Submit digitally through e-KYC & e-sign(paperless) ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
దాని తర్వాత కిందకి స్క్రోల్ డౌన్ చేసి వ్యక్తిగత వివరాలను నింపాలి. ఆ తర్వాత next బటన్ క్లిక్ చేయాలి.
అందులో మీరు మార్చాలనుకుంటున్న అడ్రస్‌ను తప్పులు లేకుండా నింపాలి. మీ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీని మార్చాలని అనుకున్నా ఇక్కడ మార్చుకోవచ్చు.
అడ్రస్, కాంటాక్ట్ డిటైల్స్ అన్ని సరిగ్గా ఇచ్చిన తర్వాత పేజి కింద ఉన్న next బటన్ క్లిక్ చేయాలి.
తర్వాత పేజిలో ఐడెంటిటీ, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి.
అలాగే ఫొటో, సంతకం కూడా స్కాన్ చేసి jpeg ఫార్మట్లలో అప్లోడ్ చేయాలి. అనంతరం సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి.
అప్లికేషన్ సబ్మిట్ చేయగానే అకనాలెడ్జ్మెంట్ స్లిప్ జనరేట్ అవుతుంది. ఆ స్లిప్ ప్రింట్ అవుట్ తీసుకోవాలి. అప్లికేషన్‌ను ప్రింట్ తీసి NSDL ఆఫీస్‌కు పంపించాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ప్రూఫ్స్ లేకుండానే ఆధార్‌లో అడ్రస్ మార్చడమెలా
మీ ఆధార్‌ను ఎవరైనా వాడారా.. ఇలా తెలుసుకోండి
క్రెడిట్ కార్డు సైజ్‌లో ఆధార్.. అప్లై ఎలా చేయాలంటే..
ఆధార్ నంబర్ మర్చిపోయారా? ఇలా తెలుసుకోండి
Read Today's Latest Topstories News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

