స్వామి, అమ్మవార్లకు సంప్రదాయ పూజలు

యాదాద్రి, ఏప్రిల్ 24: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి బాలాలయంలో శనివారం స్వామి, అమ్మవార్లకు సంప్రదాయ పూజలు శాస్ర్తోక్తంగా జరిగాయి. అర్చక బృందం ప్రతిష్టామూర్తులకు నిజాభిషేకం మొదలుకుని తులసి అర్చనలు అత్యంత వైభవంగా చేపట్టారు. ఉదయం 8 గంటలకు సుదర్శన ఆళ్వారును కొలుస్తూ సుదర్శన నారసింహ హోమం జరిపారు. శ్రీలక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణ తంతు జరిపారు. కల్యాణ మూర్తులను ముస్తాబు చేసి బాలాలయం ముఖ మండపంలో భక్తులకు అభిముఖంగా అధిష్టించి కల్యాణ తంతును నిర్వహించారు. కల్యాణం అనంతరం దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు ఉదయం మూడు గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు పంచనారసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేసి, హారతి నివేదనలు అర్పించారు. ఆలయంలో దర్శనం అనంతరం అష్టోత్తర పూజల్లో పలువురు భక్తులు పాల్గొన్నారు. సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామివారికి సహస్రనామార్చన, పుష్కరిణి వద్ద కొలువై ఉన్న క్షేత్ర పాలక ఆంజనేయస్వామివారికి జరిగిన పూజల్లో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
ఆదాయం రూ. 3,64,033
- యాదాద్రీశుడికి నిత్యరాబడి రూ. 3,64,033 సమకూరిందని ఆలయ ఈవో ఎన్. గీత తెలిపారు.
- ప్రధాన బుకింగ్ ద్వారా రూ. 23,346,
- రూ. 100 దర్శనాల ద్వారా రూ. 2,600,
- వీఐపీ దర్శనాల ద్వారా రూ. 2,100,
- నిత్య కైంకర్యాల ద్వారా రూ. 800,
- సుప్రభాతం ద్వారా రూ. 100,
- క్యారీబ్యాగుల ద్వారా రూ. 1,100,
- వ్రతాల ద్వారా రూ. 15,000,
- కల్యాణకట్ట ద్వారా రూ. 10,200,
- ప్రసాద విక్రయాల ద్వారా రూ. 1,15,565,
- వాహనపూజల ద్వారా రూ. 5,100,
- టోల్గేట్ ద్వారా రూ. 480,
- అన్నదాన విరాళం ద్వారా రూ. 2,353,
- సువర్ణపుష్పార్చన ద్వారా రూ. 24,040,
- యాదరుషి నిలయం ద్వారా రూ. 14,300,
- శివాలయం ద్వారా రూ. 500,
- పాతగుట్ట ద్వారా రూ. 4,920,
- ఇతర విభాగాలు రూ. 1,29,529తో కలిపి స్వామివారికి రూ. 3,64,033 ఆదాయం లభించిందన్నారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

