‘ఆయువు తీస్తున్న విష వాయువు’
రసాయన కంపెనీల నుంచి వెలువడే విష వాయువులు ప్రజల ఆరోగ్యానికి పెనుముప్పుగా మారి ప్రాణాలు బలిగొంటున్నాయని ప్రముఖ పర్యావరణవేత్త, ప్రొఫెసర్ పురుషోత్తమ రెడ్డి అన్నారు. బుధవారం భూదాన్ పోచంపల్లి మండలం అంతమ్మగూడెం గ్రామ శివారులోని రసాయన కంపెనీల నుండి..
– సమస్య పరిష్కరించే వరకు సంఘటితంగా ఉద్యమించాలి
– పర్యావరణ వేత్త, ప్రొఫెసర్ పురుషోత్తమ రెడ్డి
భూదాన్ పోచంపల్లి, మే 13 : రసాయన కంపెనీల నుంచి వెలువడే విష వాయువులు ప్రజల ఆరోగ్యానికి పెనుముప్పుగా మారి ప్రాణాలు బలిగొంటున్నాయని ప్రముఖ పర్యావరణవేత్త, ప్రొఫెసర్ పురుషోత్తమ రెడ్డి అన్నారు. బుధవారం భూదాన్ పోచంపల్లి మండలం అంతమ్మగూడెం గ్రామ శివారులోని రసాయన కంపెనీల నుండి వెదజల్లుతున్న కాలుష్యానికి నిరసనగా కాలుష్య విముక్తి పోరాట సమితి ఆధ్వర్యంలో అఖిలపక్ష కమిటీ గ్రామస్తుల ఆధ్వర్యంలో నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పాస్జీన్ వాయువు అత్యంత విషపూరితమైనదని, మొదటి ప్రపంచ యుద్ధంలో శత్రువులను చంపడానికి వాడిన విషపూరిత రసాయనం ఇప్పుడు సైలెంట్ కిల్లర్ గా అంతమ్మగూడెంలో ప్రజల ప్రాణాలను అరిస్తుందన్నారు. హెజో లో ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో తీవ్రమైన వాయువు నీరు, భూమి కాలుష్యానికి పాల్పడుతుందన్నారు.
పీల్చే గాలిలో పాస్జీన్, బెంజిన్, ఇథైల్ బెంజిన్, టోలిన్, ఎసిటోన్, డైక్లోరో మీథిన్, డైమిథైల్ ఫార్మామైడ్, నాప్తాలిన్ ప్రమాదకర రసాయనాలు గాలిలో చేరాయని, దీంతో ప్రజలు వింత రోగాలతో అనారోగ్యాలు బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమల సమీపంలో 9 నుండి 30 ఫీట్లు భూమి కింది భాగంలో పూర్తిగా రసాయనలతో నిండి ఉందని, కాలుష్య నిబంధనలు ఉల్లంఘించిన రసాయన కంపెనీలపై పీసిబి అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కంపెనీల కాలుష్యంపై సమగ్ర దర్యాప్తు జరిపించి పొల్యూషన్ వల్ల నష్టపోయిన రైతులు, ప్రజలకు నష్టపరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత అని, సమస్యల పరిష్కారం కోసం సంఘటితంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
పీల్చే విష వాయువుతో ప్రజలు బతికే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన ఎకరాకు రూ.52 వేల నష్ట పరిహారం రైతులకు అందించాలని, సాగు, త్రాగు నీరు కల్పించాలని, వాతావరణం గాలిని కొలిచే యంత్రం ఏర్పాటు, స్థానిక ప్రాథమిక హాస్పిటల్ ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తూ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్కమ్ టాక్స్ రిటైర్డ్ ఆఫీసర్ మల్లికార్జున్ రెడ్డి, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఇంద్రసేనారెడ్డి, రాష్ట్ర నాయకుడు పాకనాటి దామోదర్ రెడ్డి, అంతమ్మగుడం కాలుష్య విముక్తి పోరాట సమితి గౌరవ అధ్యక్షుడు గుమ్మి నరేందర్ రెడ్డి, అధ్యక్షుడు గుమ్మి దామోదర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి వస్పరి ప్రభ, ఉపాధ్యక్షులు రావుల రామ్‌రెడ్డి, రేణుక, గుర్రం రామచంద్రారెడ్డి, కాలుష్య బాధితులు రావుల శశికిరణ్, గ్రామస్తులు నరసింహ బాల్‌రెడ్డి మహేష్, శివరాజు, రమేష్, లింగయ్య, జంగమ్మ, ధనలక్ష్మి, ముత్తమ్మ, సురేందర్ రెడ్డి, ఫకీరు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Keerthy Suresh | అది నాన్న-కూతురు బంధం.. మిస్కిన్ వివాదంపై స్పందించిన కీర్తి సురేష్!
సీఎం సభకు వెళ్లొస్తుండగా రెండు బస్సుల మధ్య నలిగి మహిళ మృతి.. 5లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేసిన పొన్నం
Dorothy | రొటర్డ్యామ్ ఫిలిం ఫెస్టివల్ ఎంపికైన ‘డోరతీ’.. లైమ్లైట్ విభాగంలో ప్రదర్శన!
టేకులపల్లిలో ఇసుక ట్రాక్టర్ బోల్తా.. యువకుడు మృతి.. గర్భిణి భార్య, కుమార్తెకు తీరని శోకం
Kakatiya University | కాకతీయ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్.. 14 మంది విద్యార్థులకు అస్వస్థత
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

