భువనగిరి, అక్టోబర్ 08 : ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ (ఐఆర్సీఎస్) యాదాద్రి భువనగిరి జిల్లా డైరెక్టర్లుగా ఎన్నికైన కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి, ఎస్ఎన్.చారి గురువారం తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తమ ఎన్నికకు సంబంధించిన వివరాలను తెలియజేశారు. ఈ సందర్భంగా గాదరి కిశోర్ కుమార్ వారిని శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందించారు. రెడ్‌క్రాస్ ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలను మరింత విస్తరించాలని ఆకాంక్షించారు. సేవా కార్యక్రమాల్లో తనవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు నేవూరి ధర్మేందర్ రెడ్డి, మదర్ డైరీ డైరెక్టర్ రచ్చ లక్ష్మి నర్సింహారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు పోన్నెబోయిన రమేష్, మాజీ మార్కెట్ చైర్మన్లు తీపిరెడ్డి మేఘారెడ్డి, చిప్పలపల్లి మహేంద్రనాథ్, మాజీ ఎంపీపీ దర్శనాల అంజయ్య, పీఏసీఎస్ మాజీ చైర్మన్ పొన్నాల వెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్షుడు జంగా శ్రీను, సర్పంచులు, కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

ఐఆర్సీఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా డైరెక్టర్లకు మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ సన్మానం