World No-Tobacco Day | పొగాకు అలవాటు ఓ ఊబి అని.. ధూమపానంతో జీవితాన్ని నాశనం చేసుకోవద్దని పౌర సరఫరా శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ సూచించారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా రామంతపూర్ దూరదర్శన్లో ఏర్పాటు చేసిన జీవన్ రేఖ ప్రత్యక్ష ప్రసారంలో ఆయన పాల్గొన్నారు.
పొగాకు నియంత్రణ కోసం రెండు దశాబ్దాలుగా మాచన రఘునందన్ చేస్తున్న విశేష కృషిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ..ఆయన ఆధ్వర్యంలో ప్రసార భారతిలో ఒక ప్రత్యేక లైవ్ ప్రొగ్రామ్ నిర్వహించింది. సమాజానికి ఓ మేలుకొలుపు – మాచన సూచన పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాచన పలు సూచనలు చేశారు. ఒక వ్యక్తి రోజుకు 200 ఖర్చు చేసి డబ్బా సిగరెట్లు తాగే బదులు.. అదే డబ్బును మదుపు చేసుకోవాలని సూచించారు. దీనివల్ల ఆరోగ్యంగా ఉండటంతో పాటు ఆత్మ సంతృప్తి కలుగుతుందని పేర్కొన్నారు.