‘యుద్ధాలతో మానవాళికి అపార నష్టం.. శాంతితోనే ప్రపంచ ప్రగతి’
అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పోరాడాలని సిపిఐ నల్లగొండ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పిలుపునిచ్చారు. యుద్ధాల వల్ల మానవాళికి తీరని నష్టం వాటిల్లుతోందని, ప్రపంచ శాంతి సాధన కోసం ప్రజాస్వామిక, ప్రగతిశీల శక్తులన్నీ ఐక్యంగా ఉద్యమించాలని కోరారు. శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని...
– ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
– నల్లగొండలో ఏఐపీఎస్ఓ జిల్లా 4వ మహాసభ నిర్వహణ
రామగిరి, అక్టోబర్ 10 : అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పోరాడాలని సిపిఐ నల్లగొండ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పిలుపునిచ్చారు. యుద్ధాల వల్ల మానవాళికి తీరని నష్టం వాటిల్లుతోందని, ప్రపంచ శాంతి సాధన కోసం ప్రజాస్వామిక, ప్రగతిశీల శక్తులన్నీ ఐక్యంగా ఉద్యమించాలని కోరారు. శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని పీఆర్టీయూ భవనంలో నిర్వహించిన అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం (ఏఐపీఎస్ఓ) జిల్లా 4వ మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వ్యక్తుల ఆలోచనల నుంచే శాంతి లేదా యుద్ధం ప్రారంభమవుతుందని అన్నారు. చెడు ఆలోచనలు సమాజంలో విభజనలకు దారితీస్తాయన్నారు. సామ్రాజ్యవాద విస్తరణ కాంక్షతో అమెరికా వంటి దేశాలు చిన్న దేశాలపై ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు.
తమ వ్యాపార ప్రయోజనాల కోసం కొన్ని ఐరోపా దేశాలు సైతం అమెరికా విధానాలకు మద్దతు పలుకుతున్నాయని అన్నారు. యుద్ధాల కారణంగా ఇరాక్, ఇరాన్ తదితర దేశాల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోగా, అనేక మంది గాయపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆహారం, నిత్యావసర వస్తువుల కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సామ్రాజ్యవాదం నశించాలని, సామ్యవాదం వర్ధిల్లాలని, మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాటం సాగించాలని పిలుపునిచ్చారు. సమాజంలో చోటుచేసుకునే పరిణామాలపై ప్రజలు మౌనంగా ఉండకుండా స్పందించాలని, అన్యాయాలకు వ్యతిరేకంగా గొంతెత్తాలని సూచించారు.
మహాసభకు శాంతి సంఘం జిల్లా అధ్యక్ష వర్గం అనంతుల శంకరయ్య, కట్ట వెంకటరెడ్డి, గుర్రం వెంకటరెడ్డి అధ్యక్షత వహించగా ఏఐపీఎస్ఓ రాష్ట్ర సమన్వయ ప్రధాన కార్యదర్శి కె.వి.ఎల్, నల్లగొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, శాంతి సంఘం రాష్ట్ర కార్యదర్శి జి.నాగేశ్వరరావు, ఉపాధ్యక్షురాలు ప్రొఫెసర్ సమత, జిల్లా సమన్వయ ప్రధాన కార్యదర్శి జిల్లా యాదయ్య, పర్యావరణ పరిరక్షణవేత్త శ్యామల నాగసేనారెడ్డి, మాజీ జడ్పీ కోఆప్షన్ సభ్యుడు పసల శౌరయ్య, మైనారిటీ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు డాక్టర్ ఏ.ఏ.ఖాన్, ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి చలం రంగారావు, సీనియర్ నాయకులు నేతి యాదగిరి, బుక్క ఈశ్వరయ్య, కోమటిరెడ్డి ప్రద్యుమ్నారెడ్డి, షరీఫుద్దీన్, కస్తాల వెంకన్న, తెలగమల దశరథ, బి.సప్న, ఇమాబిన్ పాల్గొన్నారు.
ఎంప్లాయిస్ యూనియన్ కూటమిని గెలిపించిన ఆర్టీసీ కార్మికులకు అభినందనలు
ఆర్టీసీ కార్మికుల హక్కుల సాధన కోసం సుదీర్ఘకాలంగా పోరాటాలు నిర్వహిస్తున్న ఎంప్లాయిస్ యూనియన్ (EU–NMU–TMU) కూటమిని గెలిపించిన ఆర్టీసీ కార్మికులకు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అభినందనలు తెలిపారు. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పోరాడుతున్న ఎంప్లాయిస్ యూనియన్ కూటమిపై కార్మికులు మరోసారి తమ విశ్వాసాన్ని చాటుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఎంప్లాయిస్ యూనియన్ కూటమిని ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ అద్దె సంఘాలకు మద్దతు ఇచ్చి తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ, ఆర్టీసీ కార్మికులు తమ ఓటు ద్వారా తగిన సమాధానం చెప్పారన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరాడే సంఘాలకే కార్మికులు మద్దతుగా నిలుస్తారని ఈ ఎన్నికల ఫలితాలు నిరూపించాయని ఆయన పేర్కొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘యుద్ధాలతో మానవాళికి అపార నష్టం.. శాంతితోనే ప్రపంచ ప్రగతి’
CJP Protest | ఢిల్లీ పోలీసులు ఎక్కడ అడ్డుకుంటే.. అక్కడ నిరసనలు కొనసాగించండి: అజింక్య షిండే
INDIA bloc | సీఈసీ రాజీనామా డిమాండ్ మరింత ఉధృతం.. సోమవారం భారీ నిరసనకు సిద్ధమైన ఇండియా బ్లాక్
AB de Villiers | వయసు పైబడినా చేవ తగ్గలే.. 37 బంతుల్లోనే డివిలియర్స్ శతకమోత..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడు ఈదురు జనార్ధన్ కుటుంబానికి అండగా కేటీఆర్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

