టీఎస్ ఎంసెట్ స్లాట్ బుకింగ్స్ షురూ
రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన ‘టీఎస్ ఎంసెట్'-2023 కౌన్సెలింగ్ షెడ్యూల్ షురూ అయ్యింది. కౌన్సెలింగ్ కోసం స్లాట్ బుకింగ్ సోమవారం ప్రారంభంకాగా జూలై 6 వరకు కొనసాగనున్నది.
- నేటి నుంచి జూలై 6వరకు విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన
- నల్లగొండ, సూర్యాపేట, యాదగిరిగుట్టలో సహాయ కేంద్రాలు
రామగిరి, జూన్ 27 : రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన ‘టీఎస్ ఎంసెట్’-2023 కౌన్సెలింగ్ షెడ్యూల్ షురూ అయ్యింది. కౌన్సెలింగ్ కోసం స్లాట్ బుకింగ్ సోమవారం ప్రారంభంకాగా జూలై 6 వరకు కొనసాగనున్నది. ఎంసెట్‌లో ఉత్తీర్ణతతో ర్యాంక్‌లు సాధించిన విద్యార్థులంతా కౌన్సెలింగ్‌కు అర్హులే. స్లాట్ బుకింగ్ కోసం http:/tseamcet.nic.inలో నమోదు చేసుకోవాలి. ఇందుకు ఆన్లైన్లో ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.1200, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.600 చెల్లించి బుక్ చేసుకోవాలి. ఆ తర్వాత స్లాట్‌లో చూపిన సమయం ప్రకారం విద్యార్థులు ఈ నెల 28 నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అందుబాటులో ఉన్న కౌన్సెలింగ్(సహాయ) కేంద్రాలకు వెళ్లి ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలను పరిశీలన చేయించుకొని కళాశాలల ఎంపికకు వెబ్ ఆప్షన్స్‌కు అవకాశం పొందాలి.
ఉమ్మడి జిల్లాలో సహాయ కేంద్రాలు ఇవే..
విద్యార్థుల సౌకర్యార్థం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మూడు సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నల్లగొండ, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల యాదగిరిగుట్ట, శ్రీవేంకటేశ్వర డిగ్రీ కళాశాల సూర్యాపేటలో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. విద్యార్థులు వారికి అందుబాటులో ఉన్న కేంద్రానికి వెళ్లి సర్టిపికెట్స్ పరిశీలన చేసుకునే అవకాశం కల్పించారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇవి పని చేస్తాయి. ప్రతి 30 నిమిషాలకు ఒక స్లాట్ ఉంటుంది. విద్యార్థికి ఆన్లైన్లో చూపిన సమయానికి అక్కడికి వెళ్లి సర్టిఫికెట్స్ పరిశీలన చేయించుకోవాల్సి ఉంటుంది. సర్టిఫికెట్స్ పరిశీలన సమయంలో విద్యార్థి సెల్ నంబర్(మొబైల్)ఇవ్వాల్సి ఉంటుంది. అదే నంబర్‌కు లాగిన్ ఐడీ, పాస్వర్డ్ వస్తుంది. దీన్ని జాగ్రతగా ఉంచుకోవాలి.
వెబ్ ఆప్షన్స్ నమోదు ఇలా…
సర్టిఫికెట్ వెరిఫికేషన్ తర్వాత విద్యార్థులు మ్యానువల్ ఆప్షన్ ఫామ్‌లో తాము చదువాలనుకుంటున్న కళాశాల, కోర్సును ్రపాధాన్యతా క్రమంలో రాసుకోవాలి. ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్ కేటాయించుకోవాలి. ఇందుకోసం ఇంట్లోని కంప్యూటర్ ద్వారా లేదా ఇంటర్నెట్ సెంటర్, మీ సేవ కేంద్రాల్లో క్రమాన్ని నమోదు చేసుకోవచ్చు. విద్యార్థులు వారి యూజర్ ఐడీ, పాస్వర్డ్ జాగ్రత్తగా ఉంచుకోవాలి.
ఆప్షన్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి
ఎంసెట్‌లో ర్యాంక్ వచ్చి సర్టిఫికెట్స్ పరిశీలన తర్వాత కళాశాలల ఎంపిక కోసం నిర్వహించే ఆప్షన్స్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇక్కడ చిన్న పొరపాటు జరిగినా విద్యార్థి భవిష్యత్కే ఇబ్బంది కలుగవచ్చు. అయితే మొదటి విడుత కౌన్సెలింగ్ చాలా కీలకమైంది. మొదటి విడుతలో మంచి కళాశాల ఎంపికలో తప్పు జరిగితే రెండో విడుత కౌన్సెలింగ్ వచ్చే సమయానికి మంచి కళాశాలలో సీటు దొరక్కపోవచ్చు.
లాగిన్ ఐడీ జాగ్రత్తగా ఉంచుకోవాలి..
విద్యార్థులు రిజిస్టర్ మొబైల్ నంబర్‌కు ఎంసెట్ ద్వారా లాగిన్ ఐడీ వస్తుంది. విద్యార్థి లాగిన్ అయిన ప్రతి పర్యాయం రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీ వచ్చేంత వరకు విద్యార్థి వేచి చూసి లాగిన్ కావాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వరుసగా ఓటీపీలు వస్తే చివరిగా వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
విద్యార్థులు తీసుకెళ్లాల్సిన ధ్రువీకరణ పత్రాలు ఇవే..
- ఎంసెట్-2023 హాల్ టిక్కెట్, ర్యాంక్ కార్డు
- టెన్త్, ఇంటర్మీడియెట్ మెమోలు
- 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికెట్లు
- ఇంటర్మీడియెట్ టీసీ
- మీ సేవలో పొందిన కుల ధ్రువీకరణ పత్రం
- ఆదాయ ధ్రువీకరణ పత్రం(జనవరి 1, 2023 తర్వాత తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది)
- పైన పేర్కొన్న అన్ని ఒరిజినల్ ధ్రువీకరణ(సర్టిఫికెట్స్)పత్రాలతోపాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీలు విధిగా తీసుకెళ్లాలలి.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

