‘పెన్‌పహాడ్ ఎస్ఐ గోపికృష్ణ నుండి ప్రాణహాని’
సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న కస్తాల గోపికృష్ణ నుండి తనకు ప్రాణహాని ఉన్నదని మండల పరిధిలోని న్యూ బంజారాహిల్స్ తండాకు చెందిన నునావత్ సుధాకర్ ఆరోపించాడు. తనకు రక్షణ కల్పించి ఎస్ఐపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ..
– నా భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుని కుటుంబానికి దూరం చేశాడు
– చంపుతామని బెదిరింపులు, పలుమార్లు రెక్కి
– రక్షణ కల్పించాలని ఎస్పీ నరసింహకు బాధితుడు నూనావత్ సుధాకర్ వినతి
పెన్‌పహాడ్, జూన్ 20 : సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న కస్తాల గోపికృష్ణ నుండి తనకు ప్రాణహాని ఉన్నదని మండల పరిధిలోని న్యూ బంజారాహిల్స్ తండాకు చెందిన నునావత్ సుధాకర్ ఆరోపించాడు. తనకు రక్షణ కల్పించి ఎస్ఐపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ శనివారం జిల్లా ఎస్పీ కె.నరసింహకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. గోపికృష్ణ, తాను ఏఆర్ కానిస్టేబుల్స్ బ్యాచ్‌మేట్స్ అని, హైదరాబాద్‌లో ఇరువురం పక్కపక్క క్వార్టర్స్‌లో ఉండేవారమని, ఆ సమయంలో తన భార్యతో గోపికృష్ణ అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు తెలిపాడు. ఈ క్రమంలో గోపికృష్ణ పెన్‌పహాడ్ ఎస్ఐగా రాగా తన భార్యను సైతం పెన్‌పహాడ్‌కు వచ్చేలా చేసి భార్య, పిల్లలకు తనను దూరం చేసినట్లు వెల్లడించాడు.
అంతేకాకుండా తనకు ఎస్ఐ ఉద్యోగం వచ్చినా తప్పుడు కేసులు పెట్టించి ఉద్యోగం పోవడానికి కారకుడైనట్లు తెలిపాడు. తన భార్యతోనూ కేసులు పెట్టించి వేధింపులకు గురి చేస్తున్నట్లు వాపోయాడు. అంతటితో ఆగకుండా తానెక్కడికి వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు వెంబడిస్తున్నారని, వారు ఎస్ఐ గోపికృష్ణకు సంబంధించిన వారేనని తెలిపాడు. తన ఫోన్ లొకేషన్, కాల్ డేటా తీసి మనోవేదనకు గురి చేస్తున్నాడని తెలిపాడు. పెన్‌పహాడ్ ఎస్ఐ తన అనుచరులతో చంపాలని చూస్తున్నాడని, ఎప్పటికైనా తనను చంపుతారని, తనకు ప్రాణ హాని ఉందని కావునా తనకు రక్షణ కల్పించాలని కోరుతూ ఎస్పీకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు సుధాకర్ వెల్లడించాడు.

‘పెన్‌పహాడ్ ఎస్ఐ గోపికృష్ణ నుండి ప్రాణహాని’
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్‌కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

