మెడపై కత్తులు పెట్టి.. మూత్రం తాగించి..
నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెంలో బీఆర్ఎస్ అభ్యర్థి మామిడి నాగలక్ష్మి భర్త యాదగిరి కిడ్నాప్ కేసులో దుండగులు వ్యవహరించిన తీరు సభ్య సమాజం నెవ్వెరబోయేలా చేసింది. శనివారం రాత్రి 9 గంటల అనంతరం విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టడంతో దుండగులు ఎట్టకేలకు యాదగిరిని విడుదల చేశారు.
- బీఆర్ఎస్ అభ్యర్థి భర్త కిడ్నాప్ కేసులో వెలుగు చూసిన ఘోరాలు
- అర్ధరాత్రి పీఎస్‌లో బైఠాయించిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు
- ఎట్టకేలకు కేసు నమోదు చేసిన పోలీసులు
- పోలీసుల వైఫల్యంపై సర్వత్రా ఆగ్రహం
నల్లగొండ ప్రతినిధి, నవంబర్30(నమస్తే తెలంగాణ) : నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెంలో బీఆర్ఎస్ అభ్యర్థి మామిడి నాగలక్ష్మి భర్త యాదగిరి కిడ్నాప్ కేసులో దుండగులు వ్యవహరించిన తీరు సభ్య సమాజం నెవ్వెరబోయేలా చేసింది. శనివారం రాత్రి 9 గంటల అనంతరం విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టడంతో దుండగులు ఎట్టకేలకు యాదగిరిని విడుదల చేశారు. మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, నల్లమోతు భాస్కర్‌రావు బాధితునికి ధైర్యం చెప్పి, నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్‌ను కలిశారు.
అనంతరం వారు యాదగిరిని తీసుకుని తిప్పర్తి పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. అక్కడే ఉన్న సీఐ కొండల్‌రెడ్డి, ఎస్ఐ శంకర్‌తో మాట్లాడుతూ గ్రామంలో ఇంత అరాచకం జరుగుతున్నా పట్టించుకోకపోవడం ఏంటని నిలదీశారు. కిడ్నాప్‌నకు గురైన యాదగిరి జరిగిన విషయాన్ని పోలీసుల ముందే చెప్పడంతో దుండగులు చేసిన దారుణాలు వెలుగు చూశాయి. యాదగిరిని నకిరేకల్‌లో పట్టణంలో కొందరు అటకాయించి కారులో ఎక్కించుకుని రోజంతా వేర్వేరు ప్రాంతాల్లో తిప్పారు. హైదరాబాద్ వైపు తీసుకెళ్తూ చిత్ర హింసలకు గురిచేసినట్లు తెలిపారు.
ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా ఓ ఫాంహౌస్‌కు తీసుకెళ్లి ‘నామినేషన్ వేస్తే ప్రాణాలు దక్కవంటూ హెచ్చరించారు. నామినేషన్ వేయొద్దని భార్యకు చెప్పాలని హెచ్చరిస్తూ యాదగిరితో నాగలక్ష్మికి ఫోన్ చేయించారు. మెడపై కత్తులు పెట్టి బూతులు తిడుతూ ఘోరంగా హింసించినట్లు వివరించారు. మద్యంలో మూత్రం పోసి తనతో బలవంతంగా తాగించారని, లేకపోతే చంపేస్తామని బెదిరించారని చెప్పారు. రోజంతా ఇష్టమొచ్చినట్లు తిడుతూ.. కొడుతూ నామినేషన్ వేస్తే ప్రాణాలు దక్కవంటూ బెదిరించినట్లు తెలిపారు. ఈ విషయాన్ని అర్ధరాత్రి పోలీసుస్టేషన్లో సీఐ, ఎస్ఐల ముందు బాధితుడు యాదగిరి స్పష్టం చేశారు. అంతకుముందే పోలీసులు యాదగిరి తనంతట తానే వాళ్లతో కలిసి వెళ్లినట్లు స్టేట్మెంట్ తీసుకున్నట్లు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు గుర్తించారు.
ఇదే స్టేట్మెంట్ను సీఐ, ఎస్ఐల ముందు పెట్టి ఇదేం పద్ధతి అంటూ నిలదీశారు. పోలీసులు దాన్ని కవర్ చేయలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తక్షణమే కిడ్నాప్, హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు ఎల్లమ్మగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేతలతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వార్డు మెంబర్‌గా నామినేషన్ వేసిన ఓ అభ్యర్థిని సైతం కాంగ్రెస్ నేతలు బెదిరించారు. కాంగ్రెస్ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా ఉట్కూరి సందీప్‌రెడ్డి నామినేషన్ వేశారు.
తాను ఏకగ్రీవం కావడం కోసం ప్రత్యర్థులెవరూ నామినేషన్లు వేయకుండా బెదిరించడంతో భయాందోళనలు నెలకొన్నాయి. గతంలో సర్పంచ్ భర్త విజయ్‌రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి ప్రస్తుత ఎన్నికల్లో తనకు ఎదురే ఉండకూడదన్న ధోరణతో వ్యవహరిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గుండాలను ప్రోత్సహిస్తూ ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను బెదిరిస్తూ పోటీ చేయకుండా అడ్డుకుంటున్నాడని విమర్శించారు. ఎల్లమ్మగూడెంలో తక్షణమే రౌడీషీటర్ సందీప్‌రెడ్డిని అరెస్టు చేయాలన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
FSSAI | బిస్కెట్లలో దాణా.. పాలల్లో డిటర్జెంట్.. మూడు కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కేసులు
Uttarakhand | సీఎం సార్..నా భార్య అవినీతి లెక్క తేల్చండి..! ఉత్తరాఖండ్ మహిళా మంత్రిపై భర్త ఆరోపణలు
RTC Elections | ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు తారుమారు?.. కాంగ్రెస్ అనుబంధ సంఘానికి కట్టబెట్టే యత్నం
Delhi Police | పోలీసుల దాష్టీకాలపై కదం తొక్కిన మహిళలు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

