‘ఉపాధ్యాయులే సమాజ నిర్మాతలు’
ఉపాధ్యాయులు సమాజానికి దిక్సూచిలుగా, మార్గనిర్దేశకులుగా నిలుస్తున్నారని నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్త మంజుల మాధవరెడ్డి అన్నారు. శుక్రవారం కట్టంగూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమానికి...
– నకిరేకల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్త మంజుల మాధవరెడ్డి
కట్టంగూర్, సెప్టెంబర్ 11 : ఉపాధ్యాయులు సమాజానికి దిక్సూచిలుగా, మార్గనిర్దేశకులుగా నిలుస్తున్నారని నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్త మంజుల మాధవరెడ్డి అన్నారు. శుక్రవారం కట్టంగూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 14 మంది ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధ్యాయుల కృషి వల్లే సమాజంలో ఎంతోమంది ఉన్నత స్థాయికి చేరుకున్నారని పేర్కొన్నారు. ప్రపంచాన్ని పాలిస్తున్న పాలకుల సైతం ఉపాధ్యాయుల వద్దే విద్యాభ్యాసం చేశారని, సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. మండల విద్యాధికారి అంబటి అంజయ్య అధ్యక్షత జరిగిన కార్యక్రమంలో మండలంలోని వివిధ ఉపాధ్యాయ సంఘాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు నిమ్మనగోటి వెంకటరమణ, చింతకాయల పుల్లయ్య, రాములు, కృష్ణ, లింగయ్య, శ్రీనివాస్, మురళయ్య, పండరి, ఎం.ఏ. గఫూర్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

