కేటీఆర్.. ఓ హంబుల్ లీడర్, అడ్మైరింగ్ అడ్మినిస్ట్రేటర్ అని తెలంగాణ పద్మశాలీ అఫీషియల్స్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి మాచన రఘునందన్‌రావు ప్రశంసించారు. మంత్రి కేటీఆర్ 46వ జన్మ దినోత్సవం సందర్భంగా రఘునందన్ ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణకు అభివృద్ధికి పాటుపడుతున్న జీనియస్ లీడర్ కేటీఆర్ అని మాచన రఘునందన్ శ్లాఘించారు. సమర్థవంతమైన నాయకుడికి కేరాఫ్ అడ్రస్ కేటీఆర్ అని పేర్కొన్నారు. కాగా, కేటీఆర్ 46వ బర్త్ డేను పురస్కరించుకొని రఘునందన్‌రావు వివిధ రంగాలకు చెందిన 46 మంది వ్యక్తుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. గతేడాది 45 ట్వీట్లతో మంత్రి కేటీఆర్‌కు రఘునందన్ వెరైటీగా బర్త్ డే విషెస్ చెప్పారు.