విహార యాత్రకు వెళ్లొద్దామా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
కొత్త ఊరు, సరికొత్త వాతావరణం, కొంగొత్త అనుభవాలు.. వేసవిలో అనుభవాలు మది నిండా దాచుకోవడం అవసరమే. బ్యాగ్ సర్దుకుని విహారానికి వెళ్తే మనసుకు, శరీరానికి ఎంతో ప్రశాంతత లభిస్తుంది. అందుకే ఈ వేసవిలో ఓ టూర్ ప్లాన్ చేయండి. వేసవి సెలవుల్లో కొత్త అనుభవాలు గడించడానికి
వేసవి విహారానికి ప్లాన్ తప్పనిసరి
ముందు చూపుతోనే ఆనంద విహారం
సెలవుల్లో కొత్త అనుభవాలు
నేరేడు చర్ల, మే, 10 : కొత్త ఊరు, సరికొత్త వాతావరణం, కొంగొత్త అనుభవాలు.. వేసవిలో అనుభవాలు మది నిండా దాచుకోవడం అవసరమే. బ్యాగ్ సర్దుకుని విహారానికి వెళ్తే మనసుకు, శరీరానికి ఎంతో ప్రశాంతత లభిస్తుంది. అందుకే ఈ వేసవిలో ఓ టూర్ ప్లాన్ చేయండి. వేసవి సెలవుల్లో కొత్త అనుభవాలు గడించడానికి ప్రణాళికలు వేసుకోండి. ప్రపంచపు మరో కోణాన్ని కళ్ల కెమెరాతో క్లిక్ చేసి మనసు మెమొరీలో దాచుకోండి.
వేసవి సెలవుల్లో తాతయ్య, అమ్మమ్మ ఇండ్లకు వెళ్లే వీలు లేని వారికి విహారానికి మించిన టైంపాస్ మరొకటి లేదు. మిత్రులతో లేదా ఒంటరిగానైనా ప్రపంచాన్ని చూడడానికి మించిన పెద్ద చదువు ఇంకేం ఉంటుంది ? విహార యాత్రకు వెళ్లేటప్పుడు వచ్చే చల్లగాలిని ఆస్వాదించడాన్ని మించిన ఆనందం ఉంటుందా…? విహార యాత్రలకు వెళ్లేటప్పుడు ఉత్సాహం ఎంత అవసరమో, జాగ్రత్త కూడా అంతే అవసరం. వీటిలో ముఖ్యమైనవి…
- విహార యాత్ర కోసం పక్కా ప్లాన్ తప్పనిసరి. హడావుడిగా యాత్రకు బయల్దేరి ఇబ్బందులు తెచ్చుకోవద్దు. వారం రోజులు ముందుగానే సిద్ధపడాలి.
- టూరిస్ట్ బస్సుల్లో వెళ్తే స్మార్ట్‌ఫోన్‌ను రెడీగా ఉంచుకోవాలి.
- ఆయా ప్రదేశాల్లో దొరికే పదార్థాలు, వసతులు లభించే చోట్ల గురించి ముందుగానే తెలుసుకోవాలి.
- చూడాల్సిన ప్రదేశాలను ముందుగా బుక్‌లో రాసుకోవాలి. అక్కడ మనకు కావాల్సిన ఆహార పదార్థాలు లభించకపోతే మనతో పాటే తీసుకెళ్లాలి.
- దుస్తులు పరిమితంగా ఉంచుకోవాలి. లేదంటే లగేజీ పెరిగిపోతుంది.
- చలి ప్రదేశాలకు వెళ్లాలనుకుంటే మీరు తీసుకెళ్లే కెమెరాలు, బైనాక్యూలర్లు, స్మార్ట్ ఫోన్లు జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి.
- ఫోన్‌తో పాటు చార్జర్, అదనపు బ్యాటరీ, పవర్ బ్యాంక్‌లు వంటివి తప్పనిసరిగా ఉండాలి.
- వాతావరణ మార్పులకు అనుగుణంగా వచ్చే జలుబు, దగ్గు విరేచనాలు, జ్వరాలు తదితర వ్యాధులకు సంబంధించిన మందులను ముందుగానే డాక్టర్‌ను సంప్రదించి వారి సలహా మేరకు వెంట తీసుకెళ్లాలి.
మెడికల్ కిట్…
యాత్రకు వెళ్లేవారు తమ వెంట మెడికల్ కిట్‌ను తప్పనిసరిగా తీసుకెళ్లాలి. వాతావరణ మార్పుల వల్ల కలిగే రుగ్మతలతో పాటు ప్రమాదాలు జరిగినా, ఎలాంటి అనారోగ్య పరిస్థితులు వచ్చినా ఈ కిట్లు ఉపయోగపడతాయి. వీటితో టించర్, అయోడిన్, హైడ్రోజన్ పెరాక్సైడ్, గాజు, గుడ్డతో పాటు వ్యాధులకు సంబంధించిన మందులు ఉండేలా చూడాలి. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు విహార యాత్ర ఎన్ని రోజులు జరుగుతుందో అంతకు రెట్టింపు రోజులకు సరిపడే మందులు కిట్‌లో ఉంచుకోవాలి.
బ్యాగ్ వెరీ ఇంపార్టెంట్…
బ్యాగ్‌ను ఎంచుకునే విధానం చక్కగా ఉండాలి. అన్ని వస్తువులు లోపల పట్టే విధంగా చూసుకోవాలి. తేలికపాటి, లోపల ఎక్కువ స్థలం ఉండే బ్యాగులు తీసుకెళ్లాలి. బ్యాగులో తేలికపాటి దుస్తులు, నూలు వస్ర్తాలు, దుప్పట్లు ఉండే విధంగా, జాగ్రత్తగా సర్దుకోవాలి.
కాఫీ, టీలు తాగాలంటే…
విహార యాత్రకు వెళ్లేవారు తమ వెంట ప్లాస్క్‌ను తీసుకెళ్లడం చాలా మంచిది. మీ జర్నీలో సకాలంలో టీ, కాఫీ వంటివి దొరక్కపోతే ప్లాస్క్‌లో నిల్వ ఉంచిన టీ, కాఫీ ఎంతో ఉపయోగపడుతాయి. మరో వైపు చలి ప్రాంతాల్లో అయితే కప్పులో కాఫీ పోసుకుని సిప్ జర్నీ చేయవచ్చు. ప్లాస్క్‌తో పాటు సాసర్, కప్పులు ఉంటే మంచిది.
జ్ఞాపకాల కోసం…
విహార యాత్రకు వెళ్లేవారు తమ వెంట కెమెరాను, డైరీని తప్పనిసరిగా తీసుకెళ్లాలి. ప్రతి సారీ కెమెరానే వినియోగించకుండా పరిసరాలను ఆస్వాదించాలి. డైరీలో ముఖ్యమైన సంఘటనలు అనుభూతులు రాసుకోవడం ఎంతో మంచిది. మరో వైపు ప్రయాణం జరిగే తీరు, రూట్ వివరాలు డైరీలో రాసుకుంటే ఇతరులకు కూడా చక్కగా ఉపయోగపడుతుంది.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

