తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
వరి పొలానికి తెగులు మందు కొట్టడంతో నష్టం వాటిల్లిందని కౌలు రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. అర్వపల్లి మండల పరిధిలోని కాసర్లపహాడ్ గ్రామానికి చెందిన కౌలు రైతు దిర్శనపు కృష్ణమూర్తి అదే గ్రామంలో 10 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. కాగా ప్రస్తుతం...
అర్వపల్లి, అక్టోబర్ 12 : వరి పొలానికి తెగులు మందు కొట్టడంతో నష్టం వాటిల్లిందని కౌలు రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. అర్వపల్లి మండల పరిధిలోని కాసర్లపహాడ్ గ్రామానికి చెందిన కౌలు రైతు దిర్శనపు కృష్ణమూర్తి అదే గ్రామంలో 10 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. కాగా ప్రస్తుతం వరి పొట్ట దశలో ఉండి పంట చేతికి వచ్చే సమయంలో పురుగు, తెగులు సోకిందని నివారణ మందు పిచికారి చేయడం కోసం మిర్యాలగూడలోని ఓ పెర్టిలైజర్ షాపు యజమాని సంప్రదించగా అతను ఇచ్చిన మందును వరిపై పిచికారి చేయగా 24 గంటల్లోనే 10 ఎకరాల వరి మొత్తం పూర్తిగా క్షీణించి మాడిపోయింది.
దాదాపు రూ.10 లక్షల వరకు నష్టం వాటిలిందని బాధిత రైతు ఆవేదన వెలిబుచ్చాడు. ఈ విషయంపై తుంగతుర్తి ఏడిఏ, జాజిరెడ్డిగూడెం ఏఓకు ఫిర్యాదు చేయగా మందులు ఇచ్చిన డీలర్ ను పిలిపించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కానీ ఇప్పటివరకు తనకు న్యాయం జరగలేదని దీంతో సోమవారం బాధిత రైతు జిల్లా కలెక్టర్ కు ప్రజావాణిలో వినతి పత్రం అందజేశాడు. తనకు జరిగిన పంట నష్టాన్ని విచారణ జరిపించి పెస్టిసైడ్స్ ఇచ్చిన డీలర్ నుండి నష్ట పరిహారం ఇప్పించి ఆదుకోవాలని కోరాడు.

తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

