శివన్నగూడెం ప్రాజెక్టు పనుల అడ్డగింత
నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని శివన్నగూడెం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా చేపడుతున్న కట్ట నిర్మాణ పనులను ముంపు గ్రామమైన నర్సిరెడ్డిగూడెం ప్రజలు బుధవారం అడ్డుకున్నారు. తమకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందించలేదని, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, పునరావాసం కల్పించాకే పనులు చేపట్టాలని ఆందోళనకు దిగారు.
- పూర్తిస్థాయిలో పరిహారం అందించాలని నిర్వాసితుల ఆందోళన
మర్రిగూడ, జూన్ 26: నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని శివన్నగూడెం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా చేపడుతున్న కట్ట నిర్మాణ పనులను ముంపు గ్రామమైన నర్సిరెడ్డిగూడెం ప్రజలు బుధవారం అడ్డుకున్నారు. తమకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందించలేదని, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, పునరావాసం కల్పించాకే పనులు చేపట్టాలని ఆందోళనకు దిగారు. గ్రామంలో 200 కుటుంబాలకు పునరావాసం రావాల్సి ఉందన్నారు. మరో 40 మందికి ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, భూ పరిహారం అందలేదన్నారు.
గ్రామానికి వెళ్లే రోడ్డును మూసేసి మరీ కట్ట నిర్మాణ పనులు చేపడుతుండడంపై బాధితులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నిర్వాసితులను గ్రామం నుంచి తరలించకుండా రోడ్డును తొలగించి రాకపోకలకు అంతరాయం కలిగించడం సరికాదని ఆవేదన చెందారు. కాంగ్రెస్ ప్రభుత్వం భూనిర్వాసితుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. తమను ఇబ్బందులకు గురిచేస్తే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సీఐ నవీన్‌కుమార్, ఎస్ఐ రంగారెడ్డి, ఇరిగేషన్ డీఈ ఖాసీం అక్కడికి చేరుకొని నిర్వాసితులతో మాట్లాడారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారం రోజుల్లో పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటానని ఇరిగేషన్ డీఈ ఖాసీం హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

