Nallagonda Police | రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలను ఖండించిన నల్లగొండ పోలీసులు
Nallagonda Police | టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోలీసులపై చేసిన వ్యాఖ్యలను నల్లగొండ పోలీస్ అసోసియేషన్ ( Nallagonda Police) తీవ్రంగా ఖండించింది. రేవంత్ (Revanth) వ్యాఖ్యలు దురదృష్టకరమని అసోసియేషన్ అధ్యక్షులు జయరాజు, కార్యదర్శి సోమయ్య అన్నారు.
నల్లగొండ : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోలీసులపై చేసిన వ్యాఖ్యలను నల్లగొండ పోలీస్ అసోసియేషన్ ( Nallagonda Police) తీవ్రంగా ఖండించింది. రేవంత్ (Revanth) వ్యాఖ్యలు దురదృష్టకరమని అసోసియేషన్ అధ్యక్షులు జయరాజు, కార్యదర్శి సోమయ్య అన్నారు. ఎవరైనా సరే పోలీస్ శాఖ, అధికారులు, ఉద్యోగులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
పోలీసుల గుడ్డలు ఊడదీసి కొడతా, డైరీలో పోలీసుల పేర్లు రాసుకుని పెట్టుకున్న లాంటి వ్యాఖ్యలు పోలీసు అధికారుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని అన్నారు. ఎంతో బాధ్యతాయుతంగా శాంతి భద్రతలు ( Law and Order) విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ అధికారుల పట్ల రేవంత్ ప్రవర్తించిన తీరును మరోసారి ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి చర్యల వలన పోలీసుల ఆత్మాభిమానాన్ని దెబ్బ తీస్తూ పోలీసుల సహనాన్ని పరీక్షించవద్దని స్పష్టంచేశారు.
సమాజంలో శాంతి భద్రతల పర్యవేక్షణ, నేరాలను అదుపు చేయడంలో తెలంగాణ పోలీసులు దేశంలో అత్యున్నత గుర్తింపును తీసుకొచ్చారని తెలిపారు. పోలీసు శాఖపై చేసిన వ్యాఖ్యలపై ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

