విజయోస్తు వివేక్
నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన చెరుపల్లి వివేక్తేజ మార్షల్ ఆర్ట్స్‌లో రాణిస్తున్నాడు. అంతర్జాతీయ వేదికలపై మెరుపులు మెరిపిస్తున్న ఆ యువకుడు కామన్వెల్త్ కరాటే చాంపియన్‌షిప్ పోటీలకు ఎంపికయ్యాడు
- కామన్వెల్త్ కరాటే చాంపియన్‌షిప్ పోటీలకు ఎంపికైన జిల్లా వాసి
- 2024 ఒలింపిక్ పోటీల్లో పతకం సాధించడమే లక్ష్యమంటున్న వివేక్తేజ
నల్లగొండ రూరల్, సెప్టెంబర్ 4 : నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన చెరుపల్లి వివేక్తేజ మార్షల్ ఆర్ట్స్‌లో రాణిస్తున్నాడు. అంతర్జాతీయ వేదికలపై మెరుపులు మెరిపిస్తున్న ఆ యువకుడు కామన్వెల్త్ కరాటే చాంపియన్‌షిప్ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ నెల 7నుంచి 11 వరకు ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హోమ్‌లో కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో వరల్డ్ టాప్ ఫైటర్స్ పాల్గొననున్నారు. ఈ పోటీల్లో కుమిటే 84 కిలోల సీనియర్ ఇండివిజివల్ ఫైట్ కరాటే విభాగంలో వివేక్తేజ పాల్గొననున్నాడు.
నల్లగొండకు చెందిన చెరుపల్లి లలిత-దశరథ దంపతుల కూమారుడు వివేక్తేజ ఎనిమిదేండ్ల వయస్సు నుంచే కరాటే ప్రాక్టీస్ ప్రారంభించాడు. తొమ్మిదో తరగతిలోనే బ్లాక్‌బెల్ట్ సాధించాడు. ఉన్నత చదువు చదివినా మార్షల్ ఆర్ట్స్‌పై మక్కువను వీడకుండా ప్రాక్టీస్ కొనసాగించాడు. బీటెక్ చేస్తూనే థాయ్‌లాండ్‌లో శిక్షణ తీసుకొని మంచి ప్రావీణ్యం సాధించాడు. బీటెక్ పూర్తి చేసిన వివేక్.. వచ్చిన ఉద్యోగావకాశాలను వదులుకొని బాక్సింగ్‌లో కఠోర సాధన చేశాడు.
ఎనిమిది రకాల మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం
ఒలింపిక్స్‌లో బంగారు పతకాలు సాధించడమే లక్ష్యంగా సాధన చేస్తున్న వివేక్ తేజ ఇప్పటి వరకు ఎనిమిది రకాల మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం సాధించాడు. థాయ్‌లాండ్‌లో బాక్సింగ్, కిక్‌బాక్సింగ్‌తోపాటు మొయిథాయ్, ఫుల్ కాంటాక్ట్ కరాటే నేర్చుకున్నాడు. కేరళలో కలరియట్టు, తమిళనాడులో సిలంబం పూర్తి చేశాడు. అదేవిధంగా ఎంఎంఏ, తైక్వాండోలోనూ ప్రావీణ్యం సాధించాడు.
ఒలింపిక్స్‌లో బంగారు పతకాలు సాధించడమే లక్ష్యం
కామన్వెల్త్ కరాటే చాంపియన్‌షిప్ పోటీలకు ఎంపిక కావడం సంతోషంగా ఉంది. 2024లో ప్యారిస్‌లో జరిగే ఒలింపిక్స్‌లో భారత్ తరఫున బాక్సింగ్‌లో పాల్గొని బంగారు పతకాలు సాధించడమే నా లక్ష్యం. స్పాన్సర్లు తోడ్పాటునందిస్తే మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతా.
– వివేక్తేజ, భారత మార్షల్ ఆర్టిస్టు
అంతర్జాతీయ స్థాయిలో సాధించిన మెడల్స్…
- 2018-2019లో యూఎస్ ఓపెన్ ఇంటర్నేషనల్ కరాటే చాంపియన్‌షిప్ పోటీల్లో రెండు సార్లు గోల్డ్ మెడల్స్ సాధించాడు.
- 2019లో మలేషియాలో జరిగిన వరల్డ్ చాంపియన్‌షిప్ పోటీల్లో సిల్వర్ మెడల్స్ సాధించాడు.
- 2020లో మలేషియాలో జరిగిన మైలో కరాటే చాంపియన్‌షిప్ పోటీల్లో బ్రౌంజ్ మెడల్ సాధించాడు.
- ఒలింపిక్స్‌లో బంగారు పతకాలు సాధిండమే లక్ష్యం
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

