రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు నల్లగొండ జిల్లా ముస్తాబైంది. ఉత్సవాలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు.
- నేడు క్లాక్‌టవర్ సెంటర్లో అమరవీరుల స్తూపానికి నివాళి
- పరేడ్‌గ్రౌండ్‌లో జెండా ఆవిష్కరించనున్న కలెక్టర్
- నేడు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు
నీలగిరి, జూన్ 1 : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు నల్లగొండ జిల్లా ముస్తాబైంది. ఉత్సవాలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. జిల్లా కేంద్రంలోని క్లాక్‌టవర్ సెంటర్, కలెక్టర్ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయాలు విద్యుత్ దీపాలతో ధగధగలాడుతున్నాయి.
పరేడ్ గ్రౌండ్లో వేడుకలు నిర్వహించేందుకు అన్నీ సిద్ధం చేశారు. ఆదివారం ఉదయం 8.45 నిమిషాలకు క్లాక్‌టవర్ సెంటర్లోని అమరవీరుల స్తూపం వద్ద కలెక్టర్ దాసరి హరిచందనతోపాటు ప్రజాప్రతినిధులు, అధికారులు నివాళులర్పించనున్నారు. అనంతరం అక్కడి నుంచి 9 గంటలకు పరేడ్ గ్రౌండ్ చేరుకొని జాతీయ జెండాను కలెక్టర్ ఆవిష్కరించనున్నారు. జిల్లా అభివృద్ధిపై ఆమె ప్రసంగించనున్నారు. పోలీస్ యంత్రాంగం అంతటా భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది.
నేడు బీఆర్ఎస్ సేవా కార్యక్రమాలు
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆదివారం వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నారు. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులు, అనాథ శరణాలయాలు, పలు సంస్థల్లో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, పండ్లు, స్వీట్లు పంపిణీతోపాటు వివిధ సేవా కార్యక్రమాలను చేపట్టనున్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

