బేతస్త మినిస్ట్రీస్ క్యాలెండర్ ఆవిష్కరణ
బేతస్త మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, సూర్యాపేట జిల్లా పాస్టర్స్ అసోషియేషన్ అధ్యక్షుడు బిషప్ దుర్గం ప్రభాకర్ రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్‌ను శుక్రవారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆవిష్కరించారు.
సూర్యాపేట టౌన్, జనవరి 5 : బేతస్త మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, సూర్యాపేట జిల్లా పాస్టర్స్ అసోషియేషన్ అధ్యక్షుడు బిషప్ దుర్గం ప్రభాకర్ రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్‌ను శుక్రవారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, ఎంపీపీ నెమ్మాది భిక్షం, కౌన్సిలర్ చింతలపాటి భరత్, నాయకులు ఆకుల లవకుశ, పాస్టర్లు ఫిలిప్, హోసన్నా, మామిడి తిరుమలేశ్, దున్న శ్యామ్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డికి శుభాకాంక్షలు
సూర్యాపేటలో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి గెలుపొందడంపై హర్షం వ్యక్తం చేస్తూ మెదక్ జిల్లాకు చెందిన ప్రముఖ ఛాయా చిత్రకారుడు డానియెల్ శుక్రవారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మర్వాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తాను స్వయంగా చిత్రీకరించిన భారీ కామధేనువు చిత్ర పటాన్ని బహూకరించి తన అభిమానాన్ని చాటుకున్నాడు. కార్యక్రమంలో నాయకులు బూర బాల సైదులు, జంపాల శ్రీను పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

