ఆపన్నుడికి లయన్స్ క్లబ్ నోబుల్ ఆపన్నహస్తం
లయన్స్ క్లబ్ ఆఫ్ నల్లగొండ నోబుల్ ఆధ్వర్యంలో గురువారం పట్టణంలోని దేవరకొండ రోడ్డులో గల మారుతీనగర్‌లో నివాసం ఉంటున్న జంపాల గోపాల్ (47)కు రూ.5 వేల విలువైన నిత్యావసర సరుకులను అందజేశారు. కండరాల క్షీణత వ్యాధితో బాధపడుతున్న గోపాల్‌కు అవసరమైన సరుకులను...
– కండరాల క్షీణత వ్యాధితో బాధపడుతున్న గోపాల్‌కు నిత్యావసర సరుకుల పంపిణీ
రామగిరి, అక్టోబర్ 15 : లయన్స్ క్లబ్ ఆఫ్ నల్లగొండ నోబుల్ ఆధ్వర్యంలో గురువారం పట్టణంలోని దేవరకొండ రోడ్డులో గల మారుతీనగర్‌లో నివాసం ఉంటున్న జంపాల గోపాల్ (47)కు రూ.5 వేల విలువైన నిత్యావసర సరుకులను అందజేశారు. కండరాల క్షీణత వ్యాధితో బాధపడుతున్న గోపాల్‌కు అవసరమైన సరుకులను ఆయన నివాసంలోనే అందించారు. క్లబ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లయన్ వెంకటరెడ్డి యాస దాతృత్వంతో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు క్లబ్ అధ్యక్షుడు బుర్రి కృష్ణశేఖర్ తెలిపారు. సమాజంలో ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి సహాయం అందించడమే క్లబ్ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి లయన్ ముప్పిడి మల్లయ్య, తాజా మాజీ అధ్యక్షుడు లయన్ ఎం.జె.ఎఫ్. సైదులు తంతెనపల్లి, జీఎస్టీ కోఆర్డినేటర్ లయన్ ముల్క నాగిరెడ్డి పాల్గొన్నారు. సేవా కార్యక్రమానికి సహకరించిన దాత వెంకటరెడ్డి యాసకు క్లబ్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆపన్నుడికి లయన్స్ క్లబ్ నోబుల్ ఆపన్నహస్తం
Maharashtra | రోడ్లపై, బహిరంగ ప్రదేశాలలో టపాసులు కాల్చడంపై మహారాష్ట్రలో నిషేధం.. బాంబే హైకోర్టు ఆదేశం
Sarpanches | విద్యుత్ సిబ్బంది కనీసం ఫోన్లు కూడా ఎత్తడం లేదు.. కరెంట్ కష్టాలపై సర్పంచ్‌లు
Bathukamma Celebrations | కుభీర్‌లో ఘనంగా కొనసాగుతున్న బతుకమ్మ సంబరాలు
Bhaskar Rao | సింగరేణి లాభాల తగ్గుదలపై సమగ్ర నివేదిక విడుదల చేయాలి : మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

