కోదాడటౌన్, డిసెంబర్ 20 : కోదాడ ఆర్టీసీ డిపోకు వెండి బహుమతి లభించింది. ఇంధన పొదుపు విభాగంలో రాష్ట్రస్థాయి అవార్డు లభించింది.
తెలంగాణ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ హైదరాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్లో బుధవారం ఈ అవార్డును కోదాడ డీఎం శ్రీహర్షకు అందజేసింది. కోదాడ ఆర్టీసీ అధికారులు సుగుణాకర్, శివకుమారి, జీఎం రావు, రంజాన్ పాల్గొన్నారు.