హాట్ సమ్మర్లో ఐస్ యాపిల్స్
చూడటానికి జెల్లీలా, పట్టుకుంటే జారిపోయేంత మృదువుగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయే తాటి ముంజలు అంటే చిన్న, పెద్ద తేడా లేకుండా అందరి నోళ్లలో నీళ్లూరుతాయి. ప్రత్యేకించి వేసవిలో లభించే పండ్లలో ముంజలు ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్నాయి. తాటి ముంజల్లో అధిక శాతం నీరు ఉంటుంది.
వేసవిలో తాటి ముంజలు దివ్యౌషధం
దేవరకొండ రూరల్, మే 7 : చూడటానికి జెల్లీలా, పట్టుకుంటే జారిపోయేంత మృదువుగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయే తాటి ముంజలు అంటే చిన్న, పెద్ద తేడా లేకుండా అందరి నోళ్లలో నీళ్లూరుతాయి. ప్రత్యేకించి వేసవిలో లభించే పండ్లలో ముంజలు ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్నాయి. తాటి ముంజల్లో అధిక శాతం నీరు ఉంటుంది. శరీరానికి కలిగించే చలువ వల్ల దీనిని ఐస్ యాపిల్ అనికూడా అంటారు. ఎండాకాలం ప్రారంభం కాగానే తాటిముంజలు మార్కెట్లోకి వస్తుంటాయి. ఒకప్పుడు పల్లెల్లో పుష్కలంగా దొరికే తాటిముంజలు ప్రస్తుతం పట్టణాల్లో రోడ్ల వెంట కుప్పలు, కుప్పలుగా పోసి అమ్ముతున్నారు. లేతవి రూ.5కు ఒకటి, ముదిరినవి రూ.5కు రెండు చొప్పున విక్రయిస్తున్నారు.
పొట్టు తీయకుండా తినాలి…
చాలామంది ముంజలపై పొట్టు తీసి తింటుంటారు. కానీ ఆ పొట్టులో ఎన్నో రకాల పోషకాలుంటాయి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి అవి చాలా అవసరం అలాగే ఈ పొట్టు ఎంతో చలువ చేస్తుంది. కాబట్టి తాటి ముంజల్ని పొట్టు తీయకుండా తింటేనే ఆరోగ్యానికి మంచిది.
బరువునూ తగ్గిస్తాయి..
తాటిముంజల్లో శరీరానికి కావల్సిన ఏ, బీ, సీ విటమిన్లు, ఐరన్, జింక్, పాస్ఫరస్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. వీటిలో అధిక మొత్తంలో నీరు ఉండటం వల్ల శరీర బరువును తగి్ంగచడంలో ఇవి ఎంతగానో తోడ్పడుతాయి. అలాగే చికెన్‌పాక్స్‌తో బాధపడే వారికి దురద నుంచి ఉపశమనం అందించి శరీరాన్ని చల్లబరుస్తాయి.
ఎన్నో పోషక విలువలు, విటమిన్లు
డీహైడ్రేషన్ నుంచి ఉపశమనం..
ఎండాకాలంలో ఎన్ని నీళ్లు తాగినా ఆవిరైపోయి గొంతు తడారిపోతుంది. ముంజల్లో నీటి శాతం అధికంగా ఉండటం వల్ల వీటిని తీసుకుంటే ఆసమస్య నుంచి మనల్ని కాపాడుకోవచ్చు. వేసవిలో శరీరానికి కావల్సిన మినరల్స్, చక్కెరను ఇవి సమతుల్యం చేస్తాయి. అధిక మొత్తంలో విటమిన్ డి, న్, క్యాల్షియం, ఉంటాయి. రుచి లేత కొబ్బరిలా ఉంటుంది.
డీ హైడ్రేషన్, దీర్ఘకాలిక వ్యాధులకు ఉపశమనం
ముంజల్లో తక్కువ మొత్తంలో క్యాలరీలు, ఎక్కువ మొత్తంలో శరీరానికి అవసరమైన శక్తి ఉంటుంది. చలువ కోసం వీటిని తింటారు. కొంత మందికి ఎండాకాలంలో వేడి కారణంగా ముఖంపై చిన్న చిన్న మొటిమలు వస్తూ ఉంటాయి. వాటి నుంచి ఉపశమనం పొందటం కోసం ముంజలు తింటారు.
క్యాన్సర్ల నుంచి…
తాటిముంజలు వివిధ రకాల ట్యూమర్స్, బ్రెస్ట్‌క్యాన్సర్ కణాలను అభివృద్ధి చేసే ఫైటో కెమికల్స్, ఆంథతోసయనిన్లాంటి వాటిని నిర్మూలిస్తాయి. ఈ పండు తినటం వల్ల క్యాన్సర్ల నుంచి దూరంగా ఉండవచ్చు. శరీరానికి కావల్సిన మినరల్స్, న్యూట్రియంట్ల శాతాన్ని బ్యాలెన్స్ చేయడంలో ముంజలు కీలక పాత్ర వహిస్తాయి.
వాంతులయ్యేలా ఉంటే…
అధిక ఎండ వేడిమికి కొంత మందికి ఒక్కోసారి వాంతులయ్యేట్లు అనిపిస్తుంది. ఇలాంటప్పుడు నిమ్మరసం తీసుకుంటారు. ఒకవేళ నిమ్మరసంతో మార్పు లేకుంటే ముంజలు తినడం చాలా మంచిది. వెంటనే ఆ పరిస్థితి నుంచి ఉపశమనం పొందవచ్చు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

