నకిరేకల్, ఫిబ్రవరి 14 : క్రీడాకారులు మంచి లక్ష్యంతో ముందుకు సాగాలని ఉమ్మడి నల్లగొండ జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చింతకాయల పుల్లయ్య సూచించారు. నకిరేకల్ మండలంలోని మంగళపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో బుధవారం సీనియర్ పురుషులు, మహిళల హ్యాండ్‌బాల్ జిల్లా జట్ల ఎంపిక జరిగింది.
మండల నోడల్ అధికారి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కర్ర వీరారెడ్డి సమక్షంలో పరిచయ కార్యక్రమం, అనంతరం జట్లను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా పుల్లయ్య మాట్లాడుతూ ఉమ్మడి జల్లా జట్టుకు ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 17 నుంచి 19 వరకు కరీంనగర్ జిల్లాలో జరి గే 52వ సీనియర్ పురుషులు, మహిళల హ్యాండ్ బాల్ చాంపియన్‌షిప్‌లో పాల్గొంటారని తెలిపారు. హ్యాండ్ బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఎండీ ఉస్మాన్, ఉపాధ్యాయులు సత్యనారాయణ, అనిల్‌రెడ్డి, సాయికుమార్ పాల్గొన్నారు.